కొవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స అందించడం కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు

0
TMedia (Telugu News) :

కొవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స అందించడం కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు

s s consultancy

జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి

టి మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట్, మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా లో
కొవిడ్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన చికిత్స అందించడం కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని బెల్లంపల్లి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 36 గంటల్లో 12 మంది మృతి అని ప్రముఖ దినపత్రికలలో, ఛానల్స్ లో ప్రచురితమైన వార్తలలో వాస్తవం లేదని, జిల్లాలోని ఆస్పత్రులలో ఆక్సిజన్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అన్నారు. వ్యాధి తీవ్రమైన కొంతమంది కొన్ని గంటల ముందే బెల్లంపల్లి ఆసుపత్రిలో చేరారని, మరికొందరు ఒకటి, రెండు రోజుల వ్యవధిలో చేరారని, నలుగురు వ్యక్తులు ఇతర జిల్లాల నుంచి నేరుగా ఆసుపత్రిలో చేరడం జరిగిందని తెలిపారు. ముగ్గురు వ్యాధిగ్రస్తులు రెండు నుండి నాలుగు రోజుల పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది వారు చికిత్స అందించలేమని చెప్పగా వ్యాధి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చారని, మృతి చెందిన వారు బెల్లంపల్లి ఆసుపత్రిలో చేరేనాటికి వ్యాధిగ్రస్తుల ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వీరిని కాపాడేందుకు వారి సాయశక్తులా కృషి చేశారని తెలిపారు. వ్యాధిగ్రస్తులలో ఆక్సిజన్ స్థాయి 54 శాతంతో ఒకరు, 60 శాతం తో ఇద్దరు, 76 శాతంతో ఒకరు, 79 శాతంతో ఒకరు, 81 శాతంతో ఒకరు, 84 శాతంతో ఇద్దరు ఆసుపత్రిలో చేరారని తెలిపారు. జిల్లాలో వైద్యులు, సిబ్బంది కొరత లేదని, అవసరమైన అన్ని రకాల మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని, వ్యాధిగ్రస్తులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని, వైద్యుల సరైన సలహా లేకుండా హోమ్ ఐసోలేషన్ పాటిస్తున్నారని, వ్యాధి తీవ్రమైన తర్వాత ఐసోలేషన్ సెంటర్ కు వస్తున్నారని, అలా కాకుండా సరైన సమయానికి ఐసోలేషన్ కేంద్రానికి వచ్చినట్లయితే మెరుగైన వైద్య చికిత్స అందించడం ద్వారా కాపాడగలమని తెలిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.