ఖమ్మం కార్పొరేషన్ లో ఖతర్నాక్ కథలు

0
TMedia (Telugu News) :

-డేటా ఎంట్రీ ఉద్యోగుల పేరిట నియామకాలు
-పని చేయించుకొని వేతనం ఎగవేత,తొలగింపు
-బినామీ ని ఏర్పాటు చేసుకొని బారి స్వాహకు రంగం సిద్ధం

టీమీడియా ఖమ్మం సిటీ బ్యూరో:
ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో గత పాలక వర్గం లో ప్రారంభం అయిన ఖాతర్నాక్ వ్యవహారాలు కొన్ని నేటికి కొనసాగుతున్న వైనం బైటపడింది.బదిలీపై వెళ్లిన ఏసీపీ రామచంద్ర రావు తో. పాటు,ప్రస్తుతం ఉన్న పెక్టర్ శ్రీనివాసరావు సంతకాలు డబ్బులు కోసం కమిషనర్ కు పెట్టిన ప్రొసీడింగ్ పై ఉన్నాయి..కమిషనర్ ప్రొసీడింగ్ కు అప్రూవల్ ఇవ్వకుండా తిప్పి పంపారు.తిరిగి రెండవ ప్రొసీడింగ్ సిద్ధం చేశారు..ఈ రెండు కార్పొరేషన్ లోని ఎల్ ఆర్ఎస్ విభాగంలో నిబంధనలు కు విరుద్ధం లింగయ్య అనే వ్యక్తి పెరున ఏజెన్సీ చూపి చేయించుకున్న పనులు కు సమధించినవి.2019 లో నియమించుకొని 3నెలలకే ఇద్దరిని,5నెలలు తరువాత మరొకరిని విధులు నుండి తొలగించారు..నేటికి పనిచేసి న కాలానికి వారికి వేతనాలు ఇవ్వలేదు..గతం లో రిజెక్ట్ అయిన ప్రొసీడింగ్ స్థానం లో కొత్త ప్రొసీడింగ్ అదికూడా బాధితులు ఫిర్యాదులు,కమిషనర్ ఆదేశాలు మేరకు పెట్టారు.అవి కూడా కమిషనర్ అప్రూవల్ కి పంపడము లో జాప్యం జరుగుతుండడం అనుమానం కలిగిస్తోంది రిజెక్టు అయిన ప్రొసీడింగ్ లో ఏజెన్సీ నిర్వహకుడు అయిన లింగయ్య ఇచ్చినట్లు చెపుతున్న కోటేషన్ లో 1550లు ఉండగా,ప్రస్తుతం ప్రొసీడింగ్ లో 1600 లు ఉండటం లోనే అవినీతి స్థాయి తెలియ చేస్తోంది. మొత్తం 9లక్షల 6వేల,750రుపాయలు కు ఈ బిల్లు ఉంది. ఇందులో వాస్తవంగా పని చేసిన వారికి చెల్లించేది 3 లక్షల కు మించి లెదు అనేది తెలుస్తోంది..

    24 గంటల్లోనే అన్ని..
  ---

నిబంధనలు ప్రకారం.వచ్చిన కొటేషన్లు ను పరిశీలించి ఆమోదానికి వారం పడుతుంది.ఖమ్మం కార్పొరేషన్ లో కమీషనర్ కి తెలియకుండా అన్ని 24 గంటల్లో పూర్తి చేశారు.వారి ప్రొసీడింగ్ ప్రకారం..2020 సెప్టెంబర్ 21 న కమిషనర్ మీటింగ్ పెట్టి ఏసీపీ ని ఏఆర్ఎస్ డేటా ఎంట్రీ చేయించండి అని ఓరల్ ఆదేశాలు ఇచ్చారు.22న కొటేషన్లు పిలవగా ముగ్గురు వచ్చారు అందులో కంప్యూటర్, ప్రింటర్,స్కానర్ ఆపరేటర్ తో కలిపి రోజుకి 1550 లు కు చేస్తా అన్న ఖమ్మం యూపీహెచ్ కాలని కి చెందిన డి లింగయ్య ఫైనల్ చేశారు.ఇతనికి డేటా ఎంట్రీ లో 8 ఏళ్ళు అనుభవం ఉంది అన్నది అధికారు ల ప్రొసీడింగ్ లో ఉంది..కనీసం కంప్యూటర్ నాలెడ్జి కూడా లింగయ్య కి లేదు అనేది తెలుస్తోంది.

s s consultancy

వినతులు ఇచ్చిన బాధితులు

తమకు రావాల్సిన వేతనము ఇవ్వాక పోవడం పై బాధితులు ఇప్పటికే పలుమార్లు అధికారులు కు వినతులు ఇచ్చారు స్పందించి న మున్సిపల్ కమిషనర్ వారికి వేతనం చెల్లించాలి వెంటనే అని ఆదేశించారు. అందుకు సంధించిన కాగితాలు కమిషనర్ లాగేన్ కు పంపే విషయంలో జాప్యం వెనుక కమిషన్లు వ్యవహారం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రవైట్ వ్యక్తులు చేతుల్లోకి దరకాస్తులు

కార్పొరేషన్ లో అత్యంత విలువైన ఏల్ ఆర్ఎన్ దరకస్థులు అనధికార వ్యక్తుల చేతుల్లోకి డేటా ఎంట్రీ పేరుతో ఇవ్వడం అనుమానం కలిగిస్తోంది..తొలగించిన వారి స్థానంలో నియమించ బడిన వారికి వేతనాలు లేవు అనేది తెలుస్తోంది.వారి నియామకం కు మున్సిపల్ కమిషనర్ ఆమోదం కూడా లేదు అనేది తెలుస్తోంది.(మరికొన్ని వివారాలు రేపటి సంచికలో)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.