క్షేత్ర స్థాయిలో పార్టీను బలోపేతం చేయండి ;శ్రీకాంత్___

0
TMedia (Telugu News) :

ఖమ్మం ;
నగరంలో ప్రజా పునాది మరింత విస్తరించడానికి క్షేత్ర స్థాయిలో పార్టీను బలోపేతం చేయాలని సీపీఎంరాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ కోరారు. శనివారం టూ టౌన్ లోసిపిఎం శాఖా మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 44వ డివిజన్ పీఆర్ టియూ ఆఫీస్ వద్ద పార్టీ జెండాను శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరంలో ప్రజా సమస్యలపై నిజాయితీగా, నికరంగా పోరాటాలు చేసేది కేవలం సిపిఎం మాత్రమేనని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతి డివిజన్ పరిధిలో పార్టీ సభ్యుల నాణ్యత పెరగటానికి మరింతగా రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవాలి అని కోరారు. ప్రతి పార్టీ సభ్యుడు ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి వారి ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కారం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ సభలో పార్టీ టూ టౌన్ సెక్రటరీ వై విక్రమ్, నాయకులు నర్రా రమేష్, బి సుదర్శన్, SK హుస్సేన్, డి నాగరాజు, కె వెంకన్న, పి వాసు, షుఖర్ తదితరులు పాల్గొన్నారు.

s s consultancy

CPM state committee member Yarra Srikanth urged the party to strengthen itself at the field level to further expand the public base in the city.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.