పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రజాదివాస్

0
TMedia (Telugu News) :

ఖమ్మం,. . ప్రతి ఫిర్యాదులో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాదివాస్ కార్యక్రమంలో సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు.కాగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఫిర్యాదులో అధికంగా భూ వివాదాలు,వృద్ధాప్యంలో వారసులు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కుటుంబ,వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలు , భార్యభర్తల సమస్యలపై వచ్చిన బాధితుల ఫిర్యాదులను పరిశీలించారు.ఫిర్యాదలపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ ఆదేశించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.