జీడీపి పెరుగుదలకు వ్యవసాయం ” తోడ్పాటెంత ?

0
TMedia (Telugu News) :

టీఆర్ఎస్ లోకసభ పక్ష నేత , ఖమ్మం ఎంపి నామ

s s consultancy

న్యూఢిల్లీ : దేశ జీడీపీ పెరుగుదలలో వ్యవసాయం , వ్యవసాయ అనుబంధ రంగాల తోడ్పాటెంతని టిఆర్ఎస్ లోకసభ పక్షనేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశ్నించారు . వర్షకాల పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మంగళవారం దేశ స్థూల జాతీయోత్పత్తి ( జీడీపీ ) కి వ్యవసాయరంగం నుంచి అందుతున్న తోడ్పాటు గురించి ఎంపీ నామ లిఖితపూర్వకంగా ప్రశ్నించారు . మూడేళ్లలో జీడీపీ సాధించిన ప్రగతిలో వ్యవసాయ , వ్యవసాయ అనుబంధ రంగాల సహకారం గురించి వివరించాలని కోరారు . గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ రంగ ఆర్ధిక వ్యవస్థ క్షీణిస్తున్నట్లు ఉంటే అందుకు గల కారణాలు తెలపాలని కోరారు . వివిధ ప్రభుత్వ పథకాల కింద వ్యవసాయ అనుబంధ రంగాలలో ప్రస్తుత స్థాయి పెట్టుబడులు సరిపోకపోతే అందుకు గల కారణాలు తెలపాలన్నారు . వ్యవసాయ వృద్ధి రేటును పెంచడానికి , వ్యవసాయ రంగంలో మూలధన పెట్టుబడులను పెంచడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలను వివరించాలని ఎంపీ నామ నాగేశ్వరరావు రాతపూర్వకంగా ప్రశ్నించారు . సభలో ఎంపీ నామ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానం ఇస్తూ వ్యవసాయం వ్యవసాయాభివృద్ధి కోసం రాష్ట్రాలు తీసుకుంటున్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తునే మరోవైపు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు , సంస్కరణలు ప్రవేశపెట్టడంతోపాటు బడ్జెట్ లో వ్యవసాయరంగానికి అధికంగా నిధులను కేటాయిస్తున్నామన్నారు . కనీస మద్దతు ధరలో ఒకటిన్నర రెట్లు భరించడం , పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆదాయ మద్దతు , అగ్రికల్చర్ లో పెట్టుబడులు పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు.

MP Nama Nageswara Rao was asked in writing to explain the measures proposed by the government to increase the agricultural growth rate and increase capital investment in the agricultural sector.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.