కాంట్రాక్టర్లు కనుసన్నల్లోనే మత్య సొసైటీలు

0
TMedia (Telugu News) :

టీమీడియా ముదిగొండ;

ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో చెరువులు ఉండగా చాలా చెరువులకు మత్స్యకారుల సొసైటీలు ఉన్నాయి. కొన్ని చెరువులు గ్రామ పంచాయతీలు మరికొన్ని మత్స్యశాఖ పరిదిలో ఉన్నాయి. మత్స్యకారుల సొసైటీలు ఉన్న చోట చెరువుపై వారికే హక్కు ఉంటుంది. చెరువులో చేపలు పెంచటానికి, అమ్మటానికి కూడా వీరికే హక్కు ఉంటుంది. చాప పిల్లని చెరువులో పోసిన దగ్గర్నుంచి వాటిని సంరక్షించి అమ్మే వరకు సొసైటీదే బాధ్యత కాగా ఈ చేపల్ని అమ్మడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. చేపల సొసైటీ సభ్యులకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తుంది. చేపలను అమ్ముకోవడానికి ద్విచక్ర వాహనాలు తో పాటు టాటా ఏస్ వాహనం కూడా ఇచ్చారు. వీటితో పాటు వలలు, చేపల కి ఆహారం, చేపల వేటకు వాడే పడవలను కూడా ప్రభుత్వమే కొన్ని ఉచితంగా కొన్ని సబ్సిడీ లో అందిస్తుంది. సొసైటీలు ఇవన్నీ తీసుకుని చెరువులోని చేపలను వారే చేపలు పట్టి విక్రయించాల్సి ఉంటుంది. కానీ మండలం లో ఏ ఒక్క చెరువులో చేపలను కూడా ఈ పద్ధతిలో విక్రయించలేదు.

s s consultancy

చేపలను పట్టుకోమని చెరువుని కాంట్రాక్టర్లకు అమ్ముకుని సొసైటీ సభ్యులు కనీసం చెరువు వైపు వెళ్లను కూడా వెల్లటం లేదు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుని చాపల పట్టుకోమని చెరువును అప్పజెపుతున్నారు. సొసైటీ సభ్యులు చేపలు పట్టి చుట్టుపక్కల గ్రామాల వారికి తక్కువ ధరకు విక్రయించగా మిగిలిన చేపలను కాంట్రాక్టర్లకు విక్రయించాల్సి ఉండగా నిబంధనలు చెరువులో తొక్కి యదేచ్ఛగా చెరువులోని చేపలను అమ్ముకుంటున్నారు. సొసైటీక మత్స్యకారులు తప్ప ఎవరికీ చెరువులోకి చేపలు పట్టే హక్కు లేదు అయినా కాంట్రాక్టరులు కూలీలతో యదేచ్ఛగా చేపలు పడుతూ గ్రామస్తులకు సైతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయం గురించి అడిగితే సొసైటీ సభ్యులు, కాంట్రాక్టర్లు అంతా మా ఇష్టం మీకు దిక్కున్నచోట చెప్పుకోండి అని అంటున్నారు. మత్స్య శాఖ అధికారులకు పిర్యాదు చేయటానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తటం లేదు. అమ్యామామ్యాలు పుచ్చుకుని అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యమహరిస్తున్నరనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్దికి తోడ్పాటు అదిస్తుంటే ఆ పథకాల డబ్బులు మింగి చెరువులోని చేపలు కాంట్రాక్టర్లకు అమ్ముకుంటున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని అక్రమాలకు పాల్పడుతున్నవ్యక్తులపై చర్యలు తీసుకొని ఆ సొసైటీలను రద్దు చేసి కొత్త సొసైటీలు ఏర్పాటు చేయాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.