సుడా అనుమతుల్లేని ప్లాట్లు కొనవద్దు

0
TMedia (Telugu News) :

సుడా అనుమతి లేని ప్లాట్లు కొని నష్ట పోవద్దు
-మంత్రి పువ్వాడ కృషితో అభివృద్ధి జరిగింది
-10 కోట్లు వరకు ఆదాయం ఇప్పటి కి వచ్చింది
టీమీడియా తో సుడా చైర్మెన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌

టీమీడియా, ఖమ్మం సిటీ బ్యూరో

అనుమతుల్లేని లే ఔట్లలలో ప్లాట్లు కొని నష్ట పోవద్దని స్థంబాద్రి అర్బన్‌ డవలప్‌ మెంట్‌ అథార్టీ ఛైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌ అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమర్‌ కృషితో జరిగిన అభివృద్ధి వల్ల అందరి చూపు ఖమ్మం వైపు పడిరది తద్వారా రియల్‌ రంగం అభివృద్ధి చెందిది అన్నారు. ఇప్పటి వరకు సుడా కు 10 కోట్లు ఆదాయం వచ్చింది అన్న సుడా చైర్మెన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌ తో టి మీడియా ఇంటర్యూ ఇలా…

ప్ర.. సుడా చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టి 13 నెలలు అయింది ప్రగతి

జ. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆశీస్సులతో 2020 జూన్‌ 16న సుడా చైర్మన్‌ గా బాధ్యతలు స్వీరించాను. అప్పటి నుంచి నా బాద్యతలు నిర్వర్తించటంతో

సంతృప్తికరంగా ఉన్నా.

ప్ర. సాధించిన ప్రగతి.?
జ. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఖమ్మం కూడా చాలాఅభివృద్ధి అయింది. రాష్ట్రంలో హైదరాబాద్‌ తరువాత ఖమ్మం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఖమ్మం నగరం చుట్టు పక్కల సుమారు 700 రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేశారు. లేఔట్ల యజమానులతో మీటింగ్‌లు పెట్టి వారికి ల పర్మిషన్లు తీసుకోవాలని సూచించాము అవగాహన పెంచాము. ఫలితంగా పర్మిషన్ల ద్వార ఇప 10 కోట్ల రూపాయల ఆదాయం సుదాకి వచ్చింది. 8 కోట్లుపనులకు కేటాయించాం.

ప్ర. రిజిస్ట్రేషన్‌ శాఖఆదాయం ..?
జ. సుడా అప్రూవల్‌ ఇవ్వటంతో రిజిస్ట్రేషన్ల ప్రాసెస్‌ వేగంగా నడుస్తుంది. సుడా పరిధిలో రిజిస్ట్రేషన్లకు సబంధించి ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

s s consultancy

ప్ర. ఖమ్మం నగరం చుట్టు పక్కల ఇన్ని వెంచర్లు రావటానికి మీ కృషి ఎంతవరకు ఉంది.

జ. నా కృషి కాదు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు తో ,మంత్రి కేటీఆర్ ఆదేశాలు పాటించడం,మంత్రి పువ్వాడ కృషి వల్ల ఖమ్మం నగరం వేగంగా అభివృద్ధి చెందింది. ఖమ్మం చుట్టుపక్కల ముస్తాపానగర్‌, బల్లెపల్లి, కోయచెలక, రఘునాధపాలెం వరకు సెంట్రల్‌ డివైడిరగ్‌ లైట్స్‌ ఏర్పాటు చేశారు. శ్రీశ్రీ సర్కిల్‌ నుంచి కొత్త కలెక్టరేట్‌ వరకు 100 అడుగుల రోడ్డు మంజూరు అయింది. ఇంకా అనేక విధాలుగా అభివృద్ధి జరిగింది. దీంతో రియల్‌ ఏస్టేట్‌ వెంచర్లు వేస్తున్నారు. తెలంగాణ తో పాటు ఆంద్ర వాళ్ళు ఖమ్మం లో స్థలాలు కొంటున్నారు.

ప్ర. సుడా అప్రూవల్‌ విషయం లో జాప్యం అనే భావన ఉంది. ?

జ. భావన అన్నది వాస్తవం.అది అపోహ గతంలో వెంచర్లకు పర్మిషన్లను హైదరాబాద్‌ లో తీసుకోవాల్సి వచ్చేది అందువల్ల లేట్‌ అయ్యేది. ప్రస్తుతం ప్రభుత్వం వెంచర్లకు సబంధించి అనుమతుల కోసం కలెక్టర్‌ అధ్యక్షతన డిస్ట్రిక్‌ లేవల్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఎన్‌ఓసీ ఇవ్వటంతో 21 రోజుల్లోఅప్రూవల్‌ ఇస్తున్నాము.

ప్ర.అనాధికారిక లేఔట్ల విషయంలో ఎలాంటి అవగాహన కల్పించారు

జ. సుడా లేకముందు రియల్లర్లు జీపీ లేఔట్ల ద్వార ప్లాట్లు చేశారు. అందులో కొన్ని లేఔట్లకు పర్మిషన్లు లేవు వాటి గురించి అవగాహన కల్పించాం. ప్రస్తుతం సుడా పరిధిలో 11 శాతం పార్కుకు, 40 అడుగుల రోడ్లు, వేసి మార్ట్‌ గేజ్‌ పెట్టిన వెంచర్లకే పర్మిషన్లు ఇస్తున్నాం. ఇలా పర్మిషన్లు ఇచ్చిన డీటీసీపీ వెంచర్లలో ప్లాట్లు కొని లోన్‌ పొందవచ్చు. తమ పర్మిషన్‌ ఉన్న వెంచర్లలోనే ప్లాట్లు కొనాలి అన్నది జనం లో చాలా వరకు వచ్చింది .
ప్ర. మీకు మంత్రి పువ్వాడ, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల సహకారం ఎలా ఉంది.
జ. మంత్రి పువ్వాడ, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల సహకారంతోనే బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. అందరితో కలిసి సుడా అభివృద్దికి కృషి చేస్తాను.

ప్ర;ప్రజలకు సందేశం

జ:ప్రజలు డిటిడిసి అనుమతి లేని ప్లాట్లు కొనవద్దు. నష్ట పోవద్దు .అన్ని చూసుకొని కొనుగోలు చేయండి.

Bachchu Vijay Kumar, chairman , Stambadri Urban Development Authority, said that plots should not be unauthorized lay-outs.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.