సఖీ-భరోసా కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్

మహిళల భద్రతకు మరింత భరోసా కల్పించేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.

0
TMedia (Telugu News) :

సఖీ-భరోసా కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్

టీమీడియా ఖమ్మం;
మహిళల భద్రతకు మరింత భరోసా కల్పించేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.

ఖమ్మం ప్రభుత్వ హస్పటల్ అవరణలో వున్న సఖీ-భరోసా కేంద్ర భవనాన్ని ఇటీవల జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ గారు
కేటాయించారు. ఈ నేపథ్యంలో
పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్, డిసిపి ఇంజరాపు పూజ మంగళవారం భరోసా కేంద్రాన్ని సందర్శించారు.

s s consultancy

మహిళల భద్రతకు భరోసా కల్పించేందుకు సఖీ కేంద్రంగా వున్న భవనంలోని పై అంతస్తులో ఏర్పాటు చేయనున్న భరోసా కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్ సిబ్బందికి అవసరమైన ఫర్నిచర్ ఇతర సౌకర్యాలు అందుబాటులో వుండేవిధంగా చర్య తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..గృహహింస నుంచి మొదలు లైంగికదాడుల వరకు సమాజంలో రకరకాల వేధింపులకు గురైన మహిళలు, పిల్లలను ఆదుకోవడానికి అవసరమైన పోలీస్, న్యాయ సేవలు, విచారణ, కౌన్సెలింగ్, వైద్యం తదితర అన్ని రకాల సేవలు ఇక్కడ ఒకే చోట లభిస్తాయని తెలిపారు.

ఒక మహిళా పోలీస్ అధికారి, సైకాలజిస్ట్, లీగల్ అడ్వైజర్, బాధితుల కేసులు నమోదు చేసుకోవడానికి, వారి స్టేట్ మెంట్స్ రికార్డు చేసుకునేందుకు సిబ్బందితో పాటు కౌన్సిలింగ్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు

ఈ సందర్భంగా అందుబాటులో వున్న సఖీ కేంద్రంలోని అధికారులతో మాట్లాడారు..

కార్యక్రమంలో ట్రాఫిక్ /షీ టీమ్ సిఐ అంజలి, టూ టౌన్ సిఐ కరుణకర్, సఖీ కేంద్రం డైరెక్టర్ వేణుమాధవరావు,వెంకటకృష్ణ,
శ్రావణి పాల్గొన్నారు.

POLICE COMMISSIONER VISITED SAKHI BAROSA CENTER
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.