అనుమతి లేని బోర్డులు తోలగించాలి;సిపిఎం —/

0
TMedia (Telugu News) :

కార్పోరేషన్ పరిధి లో అన్ని డివిజన్లలో అనుమతులు లేకుండా ఇష్టా రాజ్యంగా ఏర్పాటు చేస్తున్న బోర్డులు తోలగించాలని సిపిఎం ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో నగర కార్పోరేషన్ కమిషనర్ అనురాగ్ జయంతి కి వినతి పత్రం అందజేయడం జరిగింది.

s s consultancy

Also Read:కలెక్టర్ గా వివి గౌతమ్ బాధ్యతలు స్వీకరణ
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ చాలా చోట్ల రోడ్లు సరిపోవడం లేదని వెడల్పు చేస్తూ, మరో పక్క వెడల్పు చేసిన వరకు అడ్డంగా బోర్డులు పాతటం ఎంటని ప్రశ్నించారు, షాపులు, ఇండ్లు అని తేడా లేకుండా, యజమానుల అనుమతి లేకుండా ఎలా బోర్డులు పెడతారని వివరించారు. చివరికి విద్యుత్ పోరాటం లో అశువులుబాసిన సత్తెనపల్లి రామకృష్ణ స్థూపం కి కూడా అడ్డంగా బోర్డు పెట్టడం ఎటువంటి అనుమతులతో జరిగిందని వివరణ అడిగారు. లేదా నగరంలో అన్ని పార్టీలకు బోర్డు లు పెట్టుకోనే శక్తి ఉందని అనుమతి ఇస్తే అందరికీ ఇవ్వాలని కోరారు.
లేని యెడల అధికారుల ఈ పక్షపాతి ధోరణి పై దశల వారి ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ వెంటనే ఈ విషయంమై విచారించి తగిన చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు.
వినతిపత్రం అందజేశిన వారిలో పార్టీ జిల్లా కమిటి సభ్యులు యర్రా శ్రీ నివాసరావు, వై.విక్రమ్, తుశాకుల లింగయ్య, కాంపాటి వెంకన్న, శీలం వీరబాబు తదితరులు పాల్గొన్నారు,

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.