మంత్రి అజయ్ ఆశీస్సులు తో పదవి -సమన్వయం తో సమస్యలు పరీక్షస్తా

0
TMedia (Telugu News) :

నా తల్లి గారిది వ్యవసాయ కుటుంబం
టీమీడియా తో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్
—–
(టీమీడియా, ఖమ్మం సిటీ బ్యూరో)

చిన్న తనం నుంచే సేవా గుణం.. అలవవర్చుకున్న డౌలె లక్ష్మి ప్రసన్న సహాయ కార్యక్రమాలు చేయటంలో ఉండే ముందు ఉంటారు. ఆమె తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం .కావటంతో రైతుల సమస్యలపై అవగాహన ఉంది. చిన్ననాటి నుండి చురుకైన శైలి. ఏ పని చేసిన మంచి ఆలోచనా విధానంతో చేస్తూ ఉంటారు. స్కూలు ,కాలేజీ లో ఉత్తమ విద్యార్థిని, ఎమ్మెస్సీ ( కెమిస్ట్రీ) వరెకు చదివారు. వివిధ కాలేజీలో గత కొంత కాలంగా కెమిస్ట్రీ లెక్చరర్‌గా పని చేశారు. బతుకమ్మ పండుగలతో, పర్యావరణ ప్రేమికురాలుగా, అందరికీ పరిచయస్తులు, చదువుకునే పేద విద్యార్థులకు, అనాధ పిల్లలకు తన వంతుగా సహాయ పడుతూ చేసే ప్రతి పనిని మంచి మనసుతో చేసే ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ డౌలే లక్ష్మిప్రసన్నతో టీ మీడియా ఇంటర్యూ…

ప్ర. ఖమార్కెట్‌ కి మీరు తొలి చైర్‌పర్సన్‌గా తొలి మహిళ మీరు ఎలా అనిపోయిస్తోంది..?
జ. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ తెలంగాణ రాష్ట్రంలోనే రెండో పెద్ద మార్కెట్‌. ఈ మార్కెట్‌ కు మన జిల్లా నుంచే కాకుండా చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా రైతులు తమ పంటలను అమ్ముకోవటానికి తీసుకొస్తారు. ఈ మార్కెట్‌కు ఎంతో చరిత్ర ఉంది. ఇలాంటి మార్కెట్‌ కు మొదటి మహిళా చైర్‌పర్సన్‌ కావటం చాలా ఆనందంగా ఉంది.

ప్ర. ఈ కొత్త బాధ్యతలను ఎలా అనిపిస్తున్నాయి..?

జ. చిన్న తనం నుంచి సేవా కార్యక్రమాలు చేయటం అలవాటు. కాబట్టి ఇప్పుడు మార్కెట్‌ చైర్‌ పర్సన్‌ గా నేను నియామకం కావటంతో రైతులకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఇదంత రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ నాపై నమ్మకంతోనే నాకు ఈ అవకాశం వచ్చింది. మంత్రి పువ్వాడ నమ్మకాన్ని నిలబెడతా.

ప్ర. మార్కెట్‌ అబివృద్ధిలో మంత్రి పువ్వాడ సహాయం ఎలా తీసుకుంటారు.
జ. ఇప్పటికే మంత్రి పువ్వాడ ఖమ్మం నగరాన్ని, ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు. మంత్రి అభివృద్ధి పనులు చేయటంలో తనదైన శైలీలో పని చేస్తున్నారు. అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలు పరిష్కరించటంలో మంత్రి ముందుంటారు. మంత్రి సహకారంతో మార్కెట్‌ లో కొత్త అభివృద్ధికి శ్రీకారం చుడతాం. అభివృద్ధిలో నయా ట్రెండ్‌ చూస్తారు.

s s consultancy

ప్ర. సమస్యల పరిస్కారం విషయం లో పంథా..?

జ. మార్కెట్‌ ఉన్న సమస్యలు, రైతులకు మౌళిక సదుపాయాల కల్పన కోసం మార్కెట్‌ కమిటీ మరియు అధికారుల అభిప్రాయాలు తీసుకుని ఒక ప్రణాళిక ప్రకారం ప్రకారం అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. పంట అమ్ముకోవటానికి మార్కెట్‌ కు వచ్చే రైతు అమ్ముకుని ఆనందంగా ఇంటికి వెళ్లేలా సమస్యలను పరిష్కరిస్తాం.

ప్ర. మార్కెట్‌లో ఎలాంటి అభివృద్ధి పదం లో నడుపుతారు..?
జ. మార్కెట్‌ అభివృద్ధిలో కొత్త ఒరవడి తీసుకొస్తాం. ఆర్ధికంగా బలంగా లేకపోయినా, మాలో మంచితనం, సేవా గుణం చూసి నాకు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అవకాశం ఇచ్చిన మంత్రి పువ్వాడ ఆశీస్సులతో 25 ఏండ్ల పాటు గుర్తు ఉండేలా అభివృధ్ధి చేస్తాం.

ప్ర. వ్యాపారులు, రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ?
జ.ధరల విషయంలో రైతులు, వ్యాపారుల మద్య గొడవలు జరగకుండా డిజిటలైజేషన్‌ ద్వారా రాష్ట్రంలోని మిగతా మార్కెట్లు మరియు డిల్లీ, ముంబాయ్‌ లాంటి నగరాల్లోని మార్కెట్లలో పంటలకు ఇస్తున్న రేట్లను అందిరికీ తెలిసేలా చేయటం ద్వార సమస్యను పరిష్కరించవచ్చు. ఆ దిశగా అడుగులు వేస్తాం. రైతులు తమ పంటను ఆనందంగా మంచి రేట్‌కు అమ్ముకోనేలా వ్యవహరిస్తాం.

ప్ర. రైతుల విశ్రాంతి విషయంలో

జ. రైతులు పంటలు అమ్ముకోవటానికి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకొవటానికి మంచి సౌకర్యాలు కల్పిస్తాం. రైతులు తాగటానికి మంచినీరు అందుబాటులో ఉండేలా చేస్తాం. ఇంకా రైతులకు సబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తాము.
ప్ర. సమన్వయం విషయం లో మీ ఆలోచన?
జ. ప్రతి విషయంలో వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు, అధికారులు, సిబ్బందితో చర్చించి, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తాం. అందిరితో సమన్వయంతో పని చేస్తూ మార్కెట్‌ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం. మార్కెట్‌ అభివృద్ధి కోసం నిరంతరం ప్రణాళికలు రూపొంధించు కొనిఅమలు చేస్తాం.

The first women chairperson of khammam agriculture market Lakshmi Prasanna.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.