ప్రాచీన కళలకు ఎప్పుడు ఆదరణే

భరతనాట్యంపై మక్కువ చూపుతున్న చిన్నారులు

0
TMedia (Telugu News) :

గురుపూజోత్సవ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ నీరజ
_ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _
ఖమ్మం : ఒకప్పుడు తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాచీన కళలకు ఆదరణ లభించేదని తర తరాలు మారుతున్న నేపథ్యంలో ప్రాచీన కళలు తెరమరుగవుతున్న దశలో భరతనాట్యంపై నేటి తరం చిన్నారులు మక్కువ చూపుకూ వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. ఆదివారం ఖమ్మం నగరంలోని చర్చికాంపౌండ్ రోడ్డులోని మేయర్ నీరజ స్వగృహంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నటరాజ నృత్యానికేతన్ వ్యవస్థాపకులు ఎస్.

s s consultancy

మాధవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ప్రాచీన కళలకు ఆయా ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యతనిచ్చేవని ఈ మధ్య కరోనా నేపథ్యంలో కళలకు ఆదరణ తగ్గి వాటిని నమ్ముకున్న కళాకారులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నాటకాలు, నాటికలు, సినిమాలు కూడా ప్రాచీన కళల నుంచే ఉద్భవించాయని ఆమె తెలిపారు. పల్లె లో కళలను ఆదరిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ వారిని ప్రోత్సహించడంలో కొంత వెనుకబాటు ఉండడంతో వాటి పట్ల నిరుత్సాహంతో కళాకారులు ఉన్నారని వారి ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వారికి తోడ్పాటునందించాలని కోరారు. అనంతరం మేయర్ నీరజను సంస్థ వ్యవస్థాపకులు మాధవరావు ఆధ్వర్యంలో కళాకారులు ప్రత్యేకంగా సన్మానించారు. తొలుత చిన్నారులు ప్రదర్శంచిన భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిపిలో చిన్నారులు ప్రదర్శించిన తీరు ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ పునుకొల్లు రాంబ్రహ్మం నటరాజ నృత్యానికేషన్ వ్యవస్థాపకులు ఎన్. మాధనరావు, కళాకారులు, చిన్నారులు పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.