కేసీఆర్ ని వదులుకోవడానికి తెలంగాణ సిద్ధంగా లేదు…..జగదీష్ రెడ్డి

తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వాడి వేడిగా సాగుతున్నాయి.

0
TMedia (Telugu News) :

తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వాడి వేడిగా సాగుతున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి టి.పిసిసి చీఫ్ గా ఎన్నికయ్యాక కాంగ్రెస్ లో జోష్ పెరిగి నేతలు టి.ఆర్.యస్ పై మాటల దాడికి దిగుతున్నారు. టి.ఆర్.యస్. నేతలు కూడా దూకుడు పెంచి తగ్గేదే లేదు అన్నట్లు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిపక్షాల పై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

s s consultancy
ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ పార్టీల నేతలు స్టంట్ మాస్టర్లలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి స్టంట్లన్నీ కెమెరాలకే పరిమితం అని ఆయన ఎద్దేవాచేశారు. అటువంటి వారి వెంట ప్రజలు ఎవరూ నడిచేందుకు సిద్ధంగా లేరని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం రోజున ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని వదులుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేరని, ఆయన గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు.
ముఖ్యమంత్రి గా తెలంగాణాకు కేసీఆర్ ఏమి చేశారు, తెలంగాణా ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ నేతగా ఏమి సాధించారు అన్నది ఇక్కడి ప్రజలకు స్పష్టంగా తెలుసు అని ఆయన తెలిపారు.

అసలు ఈ రోజున అవాకులు చవాకులు పేలుతున్న వారికి వచ్చిన పదవులు ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బిక్షమేనని ఆయన చెప్పారు. తెలంగాణా అనే పదమే లేకుండా వారికి ఈ పదవులు దక్కేవా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లుగా ఉన్న వారి వారి స్టంట్లన్నీ దారిలో పోయేవారు చూసి కాలక్షేపం చేస్తారేమో గాని వెంట నడువరని ఆయన అన్నారు. ముందుగా ఆ విషయం తెలుసుకుని మసులుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. పైరవిలతో పదవులు రావొచ్చేమో కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతాం, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతాం అంటే తెలంగాణ సమాజం చూస్తూ ఉరుకోబోదని ఆయన హెచ్చరించారు. ప్రజాసేవే చేయాలని తాపత్రయపడుతున్న వారు ముందుగా ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చెయ్యాలి తప్ప ఇటువంటి స్టంట్ల వల్ల కాదని ఆయన చెప్పారు. ఇటువంటి వాటి వల్ల ఇప్పుడు కాదు కదా ఎన్నటికీ ప్రజాదరణ లభించిదని మంత్రి జగదీష్ రెడ్డి సుస్పష్టం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.