లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి….డిసిపి నాయక్

0
TMedia (Telugu News) :
s s consultancy

లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి….డిసిపి నాయక్

టీ మీడియా,జూన్ 13,మధిర:
లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాయక్ సూచించారు ఆదివారం మధిర సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కచ్చితంగా లాక్ డౌన్ నిబంధనలను పాటించాలన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రహదారులపై ఎవరైనా కనిపిస్తే కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. లాక్ డౌన్లో మినహాయింపు పొందిన వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డును వెంట తీసుకొని వారివారి విధులకు హాజరు కావాలన్నారు. కరోనా మహమ్మారి పారదోలేందుకు కృషి చేస్తున్న చర్యల్లో భాగంగా రాష్ట్రప్రభుత్వం కఠినతరమైన లాక్ డౌన్ ను పెట్టిందన్నారు. ప్రజలు కూడా తప్పనిసరిగా సహకరించవలసిందిగా ఆయన కోరారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రహదారులపై వాహనాలు కనిపిస్తే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. మధిర సర్కిల్ పరిధిలో ఇరవై నాలుగు చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి లాక్ డౌన్ను 8 మంది ఎస్ఐలు 10 మంది ఏఎస్ఐలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్ళ, 15 మంది అదనపు సిబ్బంది 50 మంది కానిస్టేబుళ్లు 20 మంది హోంగార్డుల తో పోలీస్ అధికారులు లాక్ డౌన్లో ను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మధిర సర్కిల్ పరిధిలో మాస్కులు లేకుండా తిరుగున్న 1177 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. లాక్ డౌన్ ఈ సమయంలో షాపులు తెరిచిన 1855 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా లాక్ డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా రహదారులపై వచ్చిన 542 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులుగుంపులగా ఉన్న 322 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. అనవసరంగా ప్రజలెవరూ రహదారుల మీదకు రావద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈపాస్ లేకుండా ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలకు అనుమతి లేదన్నారు. ఈ సమావేశంలో వైరా ఏసిపి సత్యనారాయణ మధిర సిఐ మురళి టౌను, రూరల్ ఎస్సైలు సతీష్ కుమార్, రమేష్ కుమార్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.