నిబంధనలు పాటిద్దాం కరోనా ని తరిమికొడదాం

0
TMedia (Telugu News) :
s s consultancy

లాక్డౌన్ నిబంధనలు పాటిద్దాం కరోనా ని తరిమికొడదాం
టీ మీడియా మెదక్ జిల్లా శంకరంపేట్ ఆ (మే 14):తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణ చేయడానికి ప్రభుత్వం కాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసర సరుకుల కోసం ఇతరత్రా పనుల కోసం వెసులుబాటు కల్పించడం జరిగింది.ఉదయం 10 గంటల తరువాత పూర్తి లాక్ డౌన్ అమలు చేయాలని 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
అందులో భాగంగా శంకరంపేట్ పోలీసులు 10 తర్వాత అనవసరంగా బయట వాహనాలతో తిరిగే వారికి చాలాన్ విధించడం జరిగింది.శంకరంపేట ఎస్సై ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వాహన దారుణ్ణి అనవసరంగా బయటకు వెళ్లవద్దని అత్యవసరమైతేనే తప్ప ప్రయాణాలు చేయవద్దని అవగాహన కల్పించారు.కొంతమందికి ఫైన్ లు వేయడం జరిగింది .
ఈ సందర్బంగా ఎస్సై నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం వెసులుబాటు సమయంలోనే పనులను చేసుకోవాలని 10 తర్వాత ఎవరుకుడా బయటకు రావద్దని అందరూ కరోనా కట్టడికి తమవంతు కృషి చేయాలని అన్నారు.ఎవరైనా కారణం లేకుండా బయట తిరిగితే కరోనా ఆక్ట్ ప్రకారం ఫైన్ లు వేయడం జరుగుతుందని అందరూ ఇంటివద్దనే ఉంది కరోనా ను తరిమివేయడానికి సహకరించాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.