కరోనా కట్టడి కి కర్ప్యూను పటిష్టంగా అమలు చేయాలి.

0
TMedia (Telugu News) :

కరోనా కట్టడి కి కర్ప్యూను పటిష్టంగా అమలు చేయాలి.

s s consultancy

టి-మీడియా (మే10) కర్నూలు జిల్లా

( ఆంధ్ర – కర్ణాటక బార్డర్ ) అంతర్ రాష్ట్ర సరిహద్దు ఛత్రగుడి చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు.
కరోనా కట్టడి కి కర్ప్యూను పటిష్టంగా అమలు చేయాలి.
చెక్ పోస్టులలో అప్రమత్తంగా ఉండాలి…. పకడ్బందీగా వాహనాల రాక, పోకలు లేకుండా నియంత్రించాలి.
కర్ప్యూ సమయంలో గూడ్స్ (నిత్యవసర), అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతించాలి.
చెక్ పోస్టులలో ప్రత్యేక నిఘా ఉంచి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు అన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి దినం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటున్న నేపథ్యంలో సోమవారం అంతరాష్ట్ర సరిహద్దులో ఉన్న ( ఆలూరు తాలుకా , హాలహార్వి మండలం) ఛత్రగుడి ప్రోహిబిషన్ & ఎక్సైజు చెక్ పోస్టును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు ఆకస్మిక తనిఖీ చేసి కర్ఫ్యూ ఆంక్షల అమలును పరిశీలించారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడారు.
జిల్లా వ్యాప్తంగా 6 అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఉన్నాయన్నారు. కర్ప్యూను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ప్రజలు బయటకు వస్తే మాస్కులు, భౌతిక దూరం పాటించారలన్నారు.
టీకా సెంటర్ ల వద్ద, రైతుబజార్ లు, బ్యాంకులు, మీసేవా సెంటర్ ల వద్ద మాస్కులు ధరించి బౌతిక దూరం పాటించాలన్నారు.
కరోనా కట్టడి చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు.
జిల్లా సరిహద్దు చెక్ పోస్టులలో అనుమతుల మేరకే అత్యవసర వాహనాలను అనుమతించాలన్నారు. ఇతర వాహనాలను అనుమతించారదన్నారు.
అత్యవసరమయితేనే బయట కు రావాలని పోలీస్ అధికారులు ప్రజలకు సూచించాలన్నారు.
ప్రజా రవాణా మాత్రం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నాం 12 గంటల వరకు మాత్రమే అనుమతించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ గారితో పాటు ఆలూరు సిఐ శ్రీ భాస్కర్ , ఆలూరు ఎస్సై రామాంజులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.