కరోనా పరీక్ష కోసం పడిగాపులు

0
TMedia (Telugu News) :

కరోనా పరీక్ష కోసం పడిగాపులు

s s consultancy

టి – మీడియా/ హుస్నాబాద్ ( సిద్దిపేట జిల్లా) : మే 09

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలకోసం దాదాపు రోజుకు 100 మందికి పైగా ప్రజలు ఉదయాన్నే ఆస్పత్రికి వస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది 10 గంటల తర్వాత వస్తుండడంతో లైన్ లో నిలబడలేక చెప్పులను క్యూలైన్లలో పెడుతున్నారు. కానీ ప్రస్తుతం రోజుకు ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షల కిట్ల కొరత ఉండటంతో 30 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు మూడు రోజులుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాస్తున్న తమ వంతు రావట్లేదని, కరోనా లక్షణాలతో బాధపడుతున్న తమకు నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ గా తేలితే త్వరగా మెడిసిన్ వాడి కోలుకునే అవకాశం ఉంటుందని, కానీ ఈ విధంగా రోజుకు రోజు ఆలస్యం అవుతుండడంతో వ్యాధి ఉద్ధృతి ఎక్కువగా అయి ఉంది స్థితి నెలకొంటుందని పరీక్షల కోసం వచ్చిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని వచ్చిన వారికి త్వరితగతిన పరీక్షలు నిర్వహించి కరోనా నిర్ధారణ అయితే మెడికల్ కిట్లు అందించి పంపించాలని ప్రజలు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.