మరో రెండు,మూడు వారాలు కరోన పరిస్థితి ఇదే; తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

0
TMedia (Telugu News) :

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హెల్త్ డైరెక్టర్ ప్రెస్ మీట్
టీ-మీడియా/హైదరాబాద్(మే-7):-

s s consultancy

*ఈ రోజు డెత్స్ 41
*25000 మంది సిబ్బంది తో ఇంటింటి సర్వే .

  • ఈ రోజు 8061 మంద రికవరీ.
  • ఈ రోజు 5559 కేసులు పాజిటివ్.
    *జి.హెచ్.యం.సి లో 2300 బెడ్స్ పెంపు.
    *రాష్ట్రం లో 51 ఆక్సిజన్ జనరేటర్లకు అనుమతులు.

రాష్ట్రం లో కొరోనా పరిస్థితులపై తెలంగాణా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ నిన్న సీ.యం. కేసీఆర్ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులతో సుదీర్ఘంగా జరిపిన సమీక్షా సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. మరో రెండు మూడు వారాలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రజలందరూ ఇప్పుడు తీసుకున్న విధంగానే జాగ్రత్తలు తీసుకుని వైరస్ ను రూపుమాపటానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారించాలని కోరారు. ఈ సమావేశంలోనే సీ.యం. కేసీఆర్ ప్రధాన మంత్రి మంత్రి తో మాట్లాడి రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్ డోసులను పెంచాలని అదేవిధంగా అవసరమైన మేరకు ఆక్సిజన్, రెమిడెక్స్ ఇంజక్షన్ సరఫరాను కూడా పెంచాలని కోరారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ప్రధాని సానుకూలంగా స్పందించి అవసరమైన ఏర్పాట్లు చేసే విధంగా హామీ ఇచ్చినట్లుగా తెలిపారు.
ఈ రోజు రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల పై మాట్లాడుతూ నేటి నుండి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కరోనా అవుట్ పేషెంట్ విధానం ద్వారా చికిత్సలు అందించడం జరుగుతుందని, దీనిలో భాగంగా 1,41,714 అవుట్ పేషెంట్ విధానం ద్వారా చికిత్స అందిమని ఆయన తెలిపారు. ప్రజలు అనవర భయాందోళనలకు గురి కావద్దని సూచించారు. అదే విధంగా ఈ రోజు నుండి ఇంటిటి సర్వే నిర్వహిస్తన్నట్లు ఈ సర్వేలో 20,950 టీం లు 11లక్షల ఇళ్ళను సర్వే చేసినట్లు ఆయన వివరించారు.
ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 65,370 కరోనా టెస్టుల్లో 5559 పాజిటివ్ కేసులు నిర్దారణ అయినట్లు. అదేవిధంగా ఇప్పటి వరకు మొత్తం 1,34,88,449 నిర్వహించగా 4,87,190 పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు. ఈ రోజుకు 8061 మంది రికవరీ అయినట్లు ఆయన తెలియజేశారు.
అదేవిధంగా ఎవరికైనా కరోనా సింప్టమ్స్ అనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించుకుని పాజిటివ్ గా నిర్దారణ అయితే ప్రభుత్వం అందించే కరోనా కిట్ వాడుకుంటూ హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ ఏదైనా ఎక్కువగా ఇబ్బంది ఉంటేనే హాస్పిటల్ లో చేరాలని అనవసరంగా హాస్పిటల్ లో చేరి ఆక్సిజన్ మరియు బెడ్స్ కృత్రిమ కొరత సృష్టించవద్దని కోరారు.
అదేవిధంగా బెడ్స్ విషయానికి వస్తే రాష్ట్రం లో మొత్తం 53527 బెడ్స్ ఉన్నట్లు, అందులో 28,170 బెడ్స్ పేషెంట్ లు ఉన్నట్లు ఇంకా 23 వేల పై చిలుకు బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు. అదే విధంగా బెడ్స్ ఆక్యుపన్సీ 53% కాగా 35% ఖాళీగా ఉన్నట్లు తెలియజేశారు.
వ్యాక్సిన్ విషయం లో రెండవ డోసు లబ్దిదారులకు సరైన సమయం లో వ్యాక్సిన్ అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక నుండి రెండవ డోసు లబ్దిదారులకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన తరువాత మొదటి డోసు వారికి ఇస్తామని, వ్యాక్సిన్ లభ్యత ఈరోజు వరకు 3,74,900 డోసులు ఉన్నట్లు ఇంకా 1,25,000 డోసులు రెండవ విడత లబ్దిదారులకు తక్కువగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ విషయం గురించి సీ.యం. కేసీఆర్ ప్రధాన మంత్రి కి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.
ఈ సమావేశంలో డి.యం.ఇ. రమేష్ రెడ్డి మాట్లాడుతూ జి.హెచ్.యం.సి లో ఇప్పుడు ఉన్న బెడ్స్ కి అదనంగా ఇంకా 2300 బెడ్స్ ను వివిధ గవర్నమెంట్ హాస్పిటల్ లో పెంచుతున్నట్లు అదే విధంగా ఒక నిముషానికి 2000 లీటర్ల సామర్థ్యంతో 21 ఆక్సిజన్ జవేటర్లు మొదలైనట్లు ఇంకా 51 ఆక్సిజన్ జనరేటర్లను మొదలు పెట్టడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు వివరించారు. ప్రజలెవరూ అనవసరంగా ఇళ్ళ నుండి రావద్దని అవసరమైతే మాత్రమే హాస్పిటల్ లో చేరాలని అనవసరంగా హాస్పిటల్ చేరి ఆక్సిజన్ మరియు బెడ్స్ కృత్రిమ కొరత సృష్టించవద్దని కోరారు.
(వెంకట్ బెజవాడ, టీ మీడియా, అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.