కరోనా కట్టడికి కలిసికట్టుగా పోరాడుదాం-ఎంపీపీ

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా కట్టడికి కలిసికట్టుగా పోరాడుదాం
-ఎంపీపీ జంగం శ్రీనివాస్
పెద్దశంకరంపేట:
కరోనా కట్టడికి కలిసికట్టుగా పోరాడదామని పేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు మంగళవారం నాడు పెద్దశంకరంపేట ఐదో వార్డులో వైద్య సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ పంచాయతీ సిబ్బంది తో కలిసి రెండో విడత ఫీవర్ సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వచ్చిన వారికి నయం చేయడంతోపాటు కరోనా రాకుండా ప్రాథమిక దశలోనే కరోనా కు వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.తద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు.వైద్య శాఖ మార్గదర్శకాల ప్రకారం దగ్గు,జలుబు,ఒళ్ళు నొప్పులు,వాంతులు,గొంతు నొప్పి తలనొప్పి వంటి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షల కోసం వేచి చూడకుండా మందుల కిట్టు తీసుకొని వైద్యులు చెప్పిన ప్రకారం వాడితే ప్రయోజనం ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.మందుల కిట్లు అందుబాటులో ఉన్నాయని అట్టి మందులను పూర్తిస్థాయిలో వాడాలి అన్నారు.నిర్లక్ష్యం చేయడం ద్వారా ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదం ఉందని అలాగే వ్యాధి తీవ్రత పెరిగి ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ సోకి ప్రమాదకరంగా మారుతుందని ఆయన అన్నారు.రెండో విడత ఫీవర్ సర్వే లో భాగంగా గ్రామ స్థాయి నుండి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మందులు అందించి జాగ్రత్తలు చెబుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ,ఎంపీటీసీ సుభాష్ గౌడ్,నాయకులు పున్నయ్య రాములు .ఎంపీడీఓ రంనారాయన్ ఎం పీ ఓ రియాజుద్దీన్ పంచాయతీ కార్యదర్శి విట్టల్ ,అంగన్వాడీ టీచర్ సరళ,ఆశావర్కర్లు,వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.