కర్ఫ్యూ ను కఠినంగా అమలు చేయాలి జిల్లా ఎస్పీ

0
TMedia (Telugu News) :

కర్ఫ్యూ ను కఠినంగా అమలు చేయాలి జిల్లా ఎస్పీ

s s consultancy

టి-మీడియా(మే 11) కర్నూలు జిల్లా

కర్నూలు పట్టణంలోని రాజ్ విహార్ సెంటర్ లో కర్ఫ్యూ అమలు పర్యవేక్షించిన….. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు.
కర్ఫ్యూ ను నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు.
ప్రజలు అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు రావాలి.
కర్ఫ్యూ ను కఠినంగా అమలు చేయాలని ఆయా సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు ఆదేశించారు.
కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి దినం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటున్న నేపథ్యంలో కర్నూలు పట్టణంలోని రాజ్ విహార్ సెంటర్ లో కర్ఫ్యూ అమలును జిల్లా ఎస్పీ గారు స్వయంగా మంగళవారం పరిశీలించారు.
అనవసరంగా బయటకు వచ్చే వాహనదారులను ఆపి జిల్లా ఎస్పీ గారు మందలించారు.
అత్యవసరమైన సేవలు మినహా మిగిలిన కార్యకలాపాలకు కర్ఫ్యూ సమయంలో నిషేధిస్తున్నట్లు తెలిపారు.
పోలీసు అధికారులు, సిబ్బంది కర్ఫ్యూ సమయంలో పకడ్బందీగా విధులు నిర్వర్తించాలన్నారు.
జిల్లా ఎస్పీ గారితో కర్నూలు పట్టణ డిఎస్పీ కెవి మహేష్, కర్నూలు టు టౌన్ సిఐ పార్ధసారధి రెడ్డి ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.