మధిరను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించండి…బెజవాడ రవి సిపిఐ పట్టణ కార్యదర్శి డిమాండ్

0
TMedia (Telugu News) :
s s consultancy

మధిరను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించండి…బెజవాడ రవి సిపిఐ పట్టణ కార్యదర్శి డిమాండ్.

టీ మీడియా మే 7 మధిర
మధిర ప్రాంతంలో కరోనా అత్యంత వేగంగా విస్తరస్తుందని మొదటి నుండి మోతుకుంటున్నా పట్టించుకునే వారే కరువైయ్యాడు. ఒక్క ప్రభుత్వ హాస్పిటల్స్ లో చేసిన టెస్టులలో 100 కు 50 మందికి పాజిటివ్ అని తెలుస్తుంది. ఇది ఆందోళన కలిగించే అంశము.
మధిర ప్రాంత ప్రజాప్రతినిధులు ఎన్నికలలో, సమీక్షలలో మునిగితేలుతున్నారు. మధిర నియోజకవర్గ కంద్రంలో ఇప్పుటికైనా క్వారంటైన్ సెంటర్ ను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నాం.రాష్ట్రంలో ప్రతినియజకవర్గం లో తప్పనిసరిగా కరోనా బారినపడిన ప్రజలకు కుటుంబసభ్యులనుండి వేరుగా ఉంచి ఇతర కుటుంబ సభ్యులకు కరోనా శోకకుండా ఉండేందుకే క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పింది.వ్యాధి సోకినవారికి డాక్టర్ల పర్యవేక్షణలో వ్యాధి తగ్గిన తర్వాత వారి ఇళ్లకు పంపించేవారు. అటువంటి సెంటరను ఏర్పాటుచేయమని జిల్లా అధికారులను పదే పదే అడిగినా మధిర ప్రాంతం పట్ల వారి తీరు చూస్తే సవతి తల్లి ప్రేమ లాగా ఉంది. మధిర CHC లో అనేకపోరాటాల తర్వాత X-RAY ప్లాంట్ వస్తే అదీ మున్నాళ్ళ ముచ్చటలాగే మూలానపడి 4ఏళ్ళకు పైగా అయినది.కనీసం దాన్ని వినియోగంలోకి తెద్దామన్న సొయ లేదు. దానిగురించి అనేకసార్లు స్థానికంగావున్న డాక్టర్లు ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు అడిగినా పట్టించుకున్న వారులేరు.మధిరపట్ల ఎందుకంత నిర్లక్ష్యమో జిల్లా అధికారులు చెప్పాలి. ఇప్పటికైనా క్వారెంటైన్ సెంటరను ఏర్పాటు చేయాలని
అలాగే కేసులు పెరుగుతుండటం వలన మధిరలో కంటోన్మెంట్ జోనలుగా చేసి అధికారులు మధిర ప్రజలను కరోనా నుండి రక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.