కబ్జాలకు పాల్పడుతున్న నాయకుల పై కలెక్టర్ తో విచారణ చేపట్టాలి.

0
TMedia (Telugu News) :

టిఆర్ఎస్ నాయకులు అక్రమాలు అరికట్టాలి.బిజెపి

s s consultancy

కబ్జాలకు పాల్పడుతున్న నాయకుల పై జిల్లా కలెక్టర్ తో విచారణ చేపట్టాలి.

టీ మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా.

లక్షేట్టిపెట్ మున్సిపాలిటీ లో టిఆర్ఎస్ పార్టీ నాయకుల కబ్జాలు, అక్రమ కట్టడాలు, బీజేపీ నాయకుల ను బెదిరింపులకు గురి చేయడాన్ని ఖండిస్తూ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి లక్షేట్టిపెట్ లోని ఐబి లో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. రఘునాథ్ గారు మాట్లాడుతూ లక్షేట్టిపెట్ లోని రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒకే రోజు సుమారు 60 వరకు అక్రమ రిజిస్ట్రేషన్ లు జరిగాయని, 11మే తేదీన రిజిస్ట్రేషన్ లు అన్ని రద్దు చేసి రి వెరిఫై చేయాలని అన్నారు, బీజేపీ లక్షేట్టిపెట్ మున్సిపాలిటీ అధ్యక్షుడు విరమల్ల హరిగోపాల్ రావు ని చంపుతాం అని టీఆరెస్ నాయకులు బెదిరించారు, బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు భయపడే వారు కాదని, అన్యాయాలు, అక్రమాలపై పోరాడేది బీజేపీ కార్యకర్తలు మాత్రమే అని, ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానని రఘునాథ్ గారు హామీ ఇచ్చారు, పోలీసులు బెదిరింపులు కు గురి చేసి , దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు, లక్షేట్టిపెట్ మున్సిపాలిటీ లోని ఇటిక్యాల్ చెరువు శిఖం భూమిలో మట్టి నింపుతూ చెరువు ఆనవాలు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న కూడా చెరువు శిఖం భూమిలో లారీలతో మొరం నింపుతున్నారు, ఈ సమయంలో లారీలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, అధికార పార్టీ నాయకులు, వారి అనుబంధ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు, ఇంతకు ముందు అర్థరాత్రి ఈ విధంగా చెరువులో మట్టి నింపుతున్నపుడు ఇరిగేషన్ అధికారులు వచ్చి ఆపివేయించి, ఇకముందు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, అయిన కూడా మళ్లీ చెరువులో మట్టి నింపుతున్నారు, వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, తేదీ 21 మార్చి తేదీన ఇరిగేషన్ జిల్లా అధికారులు లక్షేట్టిపెట్ కమిషనర్ గారికి, తహశీల్దార్ గారికి ఇటిక్యాల్ భూమిని పర్యవేక్షణ చేసి అక్రమ కట్టడాలను ఆపి వేయాలని నోటీసు ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు, మంత్రి ఈటెల రాజేందర్ పై ఆరోపణలు రాగానే వారిని మంత్రి వర్గంలో నుండి తొలిగించి చర్యలు తీసుకున్నట్లుగా మంచిర్యాల జిల్లా లో ఎన్నో అక్రమాలు, భూ కబ్జాలు చేస్తున్న టీఆరెస్ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. లక్షేట్టిపెట్ మున్సిపాలిటీ గా మరినప్పటి నుండి జరిగిన అక్రమ కట్టడాలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. పత్రిక సమావేశంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు విరమల్ల హరిగోపాల్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వేముల మధు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకట కృష్ణ, పల్లి రాకేష్, ఉపాధ్యక్షుడు మోటపల్కుల సతీష్ చుంచు గిరిధర్, బిసి మోర్చా అధ్యక్షుడు పాంచాల రమేష్, ఎస్సి మోర్చా అధ్యక్షుడు గడమల్ల చంద్రయ్య, కిషన్, తోట సతీష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.