సమసమాజ నిర్మాణం కోసం అవతరించిన క్రాంతి పురుషుడు బసవేశ్వరుడు

0
TMedia (Telugu News) :

సమసమాజ నిర్మాణం కోసం అవతరించిన క్రాంతి పురుషుడు బసవేశ్వరుడు

అర్చక సంఘం జేఏసీ కన్వీనర్ శర్మ, కవి,రచయిత రాపోలు సత్యనారాయణ

s s consultancy

బసవపురాణం రాసిన సోమనాథుడి జన్మస్థలం లో బసవ జయంతి

సోమనాథ కళా పీఠం ఆధ్వర్యంలో నిరాడంబరంగా వేడుకలు

పాలకుర్తి,మే14 (టీ-మీడియా ప్రతినిధి)

ఎనిమిది వందల ఎనబై ఏళ్ల క్రితమే సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ బేధాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించి సమానత్వమే తన తత్వంగా సమసమాజ నిర్మాణం కోసం అవతరించిన అభ్యుదయ వాది క్రాంతి పురుషుడు శ్రీ బసవేశ్వరుడు అని తెలంగాణ అర్చక ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కన్వీనర్ దేవగిరి వెంకట రాజేశ్వర శర్మ, కవి, రచయిత రాపోలు సత్యనారాయణ పేర్కొన్నారు. సోమనాథ కళాపీఠం అధ్వర్యంలో పాలకుర్తి శ్రీ
సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన ప్రాంగణంలో శుక్రవారం విశ్వగురు బసవ 888వ జయంతి వేడుకలు
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగింది. డాక్టర్ రాపోలు సత్యనారాయణ
కార్యక్రమానికి అధ్యక్షత వహించగా అర్చక, ఉద్యోగ సంఘం జేఏసీ కన్వీనర్ డి.వి.ఆర్ శర్మ ముఖ్య అతిథిగా
పాల్గొని మాట్లాడారు. బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రాపోలు సత్యనారాయణ మాట్లాడుతూ బసవేశ్వరుడి జీవిత విశేషాలను తెలియజేశారు, 1134 సంవత్సరం లో జన్మించిన బసవేశ్వరుడు సమాజసేవకుడిగా, సంఘ సంస్కర్తగా సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన మహోన్నతుడని కొనియాడారు. ఆ కాలంలో బసవేశ్వరున్ని బసవడు, బసవన్న అని పిలిచే వారని,
చందోబద్దమైన పద్యాలకు బదులు
విప్లవ భావజాలాలతో రచనలు చేసి వచన కవిత్వానికి ఆద్యుడు అయ్యాడని రాపోలు గుర్తు చేశారు.
ఈ రోజు న బసవేశ్వరుడి చరితను బసవ పురాణం గా రాసిన పాల్కురికి సోమనాథుడు జన్మించిన పాలకుర్తి లో బసవ జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందకరమైన విషయమని అన్నారు.
బసవన్న ప్రబోధించిన కాయక, దాసోహ సుగుణాలు నీతివంతమైన సమాజనిర్మాణానికి
దోహదపడుతాయని ఆయన అభివర్ణించారు. విశిష్ట అతిథి ప్రధానార్చకులు దేవగిరి
రామన్న లింగార్చన అధికారాన్ని అందరికి అందించిన సంస్కర్త బసవన్న అని కొనియాడారు.
బసవపురాణం వ్రాసిన మహాకవి పాలకురికి సోమనాథుని జన్మస్థలాన్ని
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, పంచాయతిరాజ్ మంత్రి దయాకర రావు
ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో
దేవస్థాన ఈ ఓ వీరస్వామి, సూపరింటెండెంట్ వెంకటయ్య, అర్చక బృందం దేవగిరి
లక్ష్మన్న, అనిల్ కుమార్, నాగరాజు, సంతోష్, శ్యాం, సిబ్బంది బండారి
శ్రీనివాసులు, నవీన్, సైదమ్మ, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం జనగామ
జిల్లా అధ్యక్షుడు బక్కెర సిద్ధయ్య, పాలకుర్తి మండల గౌరవ అధ్యక్షుడు
బక్కెర రవి, సోమనాథ కళాపీఠం గౌరవ సలహాదారు వి వెంకటేశ్వర రావు,
అధ్యక్షురాలు రాపోలు శోభారాణి, కోశాధికారి ఇమ్మడి దామోదర్, మామిండ్ల
రమేశ్ రాజా, గూడూరు లెనిన్, మేరుగు మధుసూదన్, రాపోలు సోం సాయి, గజ్జి
సంతోష్, చిక్కమఠం పర్వతయ్య, భరత్, జి నరేందర్ రెడ్డి, పుట్ట అంజనేయులు,
ఇప్పకాయల క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.