పంపు బిల్లు కట్టలేదని మంచం జప్తు:పెదోడి పై ఆపరేటర్ ఆక్రోశం

0
TMedia (Telugu News) :

పంపు బిల్లు కట్టలేదని మంచం జప్తు:పెదోడి పై ఆపరేటర్ ఆక్రోశం

s s consultancy

టీమీడియా-ప్రతినిధి

పంపు నీళ్లు తాగి నప్పుడు ..బిల్లుకట్టలని తెలియదా. అంటూ ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పోచారం గ్రామంలో పంపు ఆపరేటర్ గా చలామణి అవుతున్న వ్యక్తి .ఏకంగా ఇంట్లో మంచం జప్తు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. షోషల్ మీడియా లో వచ్చిన వీడియో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఒ ఆ గ్రామము లో దొరల జాగీర్ ఉన్నపుడు జరిగిన ఘటన రిపిడ్ అయింది అనే భావన వ్యక్తం అవుతోంది..బజారు లో బురద మడుగు ప్రక్కనే కులే స్థితి లో ఉన్న ఇంటి లో చింతల కవిత అనే ఆమె ఇల్లు.తన అసిస్టెంట్ తో బండి పై వచ్చిన పంపు ఆపరేటర్ పుల్లయ్య.. కవిత ఇంట్లో మంచం తీసుకొని .అసిస్టెంట్ తో నెత్తిన పెట్టి పట్టుకెళ్లాడు ఏమిచేస్తావో చేసుకో అంటూ హెచ్చరించాడు..ఇది అంత జనం టికెట్ లేని సినిమా లాగా చూస్తూ ఉన్నారు..అయితే ఆపరేటర్ పుల్ల య్య ఉద్యోగం అధికారమా అనధికారామా ..?కవిత బకాయి ఎంత..? తెలియాల్సి ఉంది.నవారీ మంచం విలువ 500లు కు మించి ఉండదు. ఈ చర్య వల్ల కవిత గ్రామం లో చులకన అయింది..జప్తు అనేది అధికారులు సమక్షంలో జరగాలి..ముందు నోటీస్ ఇవ్వాలి.అక్రమంగా ఇంటి లోకి పోకూడదు.. పంచాయతి జప్తుల కు కలెక్టర్ అనుమతి తో..జిల్లాపంచాయతి అధికారి ఆదేశాలు ఇవ్వాలి.అటువంటి వి లేకుండా ఆదివారం ఇటువంటి వి చేయడం అనుమానం కలిగిస్తోంది. బలమైన కారణం ఉంది అనేది తెలుస్తోంది. మొత్తం ఎపిసోడ్ వెనుక సూత్ర పాత్రధారులు ఎవరు.ఎందుకు చేయించారు తెలియాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.