జమ్ములో భారీ వర్షాలు..7గురు మృతి, 30 మంది గల్లంతు

0
TMedia (Telugu News) :

కిశ్త్వార్:

జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్వార్‌ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దాంతో బుధవారం తెల్లవారుజామునా అకస్మాత్తుగా వచ్చిన వరదలకు హొంజార్ గ్రామంలో ఏడుగురు మృతి చెందారు. దాదాపు 30 మంది ఆచూకీ గల్లంతయిందని అధికారులు వెల్లడించారు. అలాగే ఈ ఘటనలో పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైమానిక దళం సేవలు కూడా ఉపయోగించుకోనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.

s s consultancy

గత కొద్దిరోజులుగా జమ్ములోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు ఈ వానలు ఇలాగే కొనసాగుతాయన్న నివేదికల మధ్య.. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. వరదలు, కొండ చరియలు విరిగిపడే ముప్పు ఉన్న ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Heavy rains have lashed Kishtwar district of Jammu and Kashmir.Seven people were killed in flash floods in Honjar village on Wednesday morning.  

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.