ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీపీ ఎంపీడీవో

0
TMedia (Telugu News) :
s s consultancy


టీ మీడియా చింతకాని 1. రామకృష్ణాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ఎంపిపి కోపూరి పూర్ణయ్య, ఎంపీడీవో లలితకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న రోగుల్లో ఎవరికీ సీరియస్గా లేదని మామూలుగా కోవిడ్ చికిత్స పొందే వారన్నారు ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న వారికి అందుతున్న మెనూను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైనా జ్వరం తలనొప్పి ఒళ్లు నొప్పులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వెళ్లి టెస్ట్ లు చేయించుకోవాలన్నారు పాజిటివ్ వచ్చిన రోగులు ఎక్కడ బయట తిరగకుండా ఉండాలని 14 రోజులు అసోసియేషన్ లో ఉంటే బయట వారిని కాపాడిన వాళ్ళమవుతాం అన్నారు. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండొద్దు అని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు గుంపులు గుంపులుగా ఉండొద్దని. మాస్కులు లేకుండా బయటకు రావద్దని చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి అని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ కన్నెబోయిన కుటుంబరావు. ఎం పి ఓ రవీంద్ర ప్రసాద్, అంగన్వాడి టీచర్ దామా వతి, పంచాయతీ సిబ్బంది కొప్పుల నాగేశ్వరరావు సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.