నడింపల్లి గ్రామములో ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభం చెయ్యాలి

0
TMedia (Telugu News) :
s s consultancy

నడింపల్లి గ్రామములో ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభం చెయ్యాలి

టీ మీడియా అచ్చంపేట మే17: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నడింపల్లి గ్రామములో కరోనా పేషెంట్లకు నడింపల్లి గ్రామానికి సంబంధించిన ఏఈ సత్యం సహకారంతో గుడ్లు పండ్లు పల్లి పట్టిలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ మల్లేష్ మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రంలో రెండవ దశ కరోన తీవ్రంగా విజృంభిస్తుండడంతో గ్రామాలలో కూడా కరోన పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు. ప్రతి గ్రామంలో కూడా ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ప్రతి మనిషికి 10 కిలోల బియ్యం ఆరు నెలల పాటు ఇవ్వాలన్నారు కరోన వచ్చినటువంటి పేషెంట్లను సమాజంలో చిన్నచూపు చూడరాదని అన్నారు. వారికి తగిన సహాయ సహకారాలు అందించాలన్నారు. ఆక్సిజన్ లేక వేలల్లో మరణాలు జరుగుతున్నాయి అన్నారు. ప్రభుత్వాలకు ముందు చూపు లేక ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీటికి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని అన్నారు. కరోన పరీక్షలు ప్రతి ఒక్కరికి చేయాలన్నారు. కరోన కిట్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు గుండె మల్లేష్ టిఆర్ఎస్ నాయకులు ప్రతాప్ రెడ్డి ఇ అజయ్ సిపిఎం నాయకులు ఎస్ మల్లయ్య జి పరుశరాములు పంచాయతీ కార్యదర్శి ఇ భీముడు గ్రామ యువకులు కార్తీక్ రెడ్డి ఇ ఆంజనేయులు సురేందర్ కరుణ పేషెంట్లు సైదమ్మ పురుషోత్తం దేవేందర్ జంగాల యాదమ్మ గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.