చెరువులో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ;తడిసిన ధాన్యం

0
TMedia (Telugu News) :

చెరువులో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ;తడిసిన ధాన్యం

s s consultancy

..
టీ మీడియా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జూన్5;

అధికారులు చెరువులో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏరాటు చెసిన ఫలితంగా శనివారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది.కొంత కొట్టుకు పోయింది.5 రోజుల బనుండి వర్షం కురుస్తోంది.ఐకెపి వారు అంత కు ముందు ఉన్న ధాన్యం కొనుగోలు చేయలేదు .రైతులు తీవ్రంగా నస్థ పోయారు.వివరాలు పరిసి లిస్తే..
తుర్కపల్లి లో శనివారంతెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఐకెపి వరి కొనుగోలు కేంద్రం లోనికి నీరు వచ్చింది.ఆందోళనకు గురి అయిన రైతులు ధాన్యం నుగడ్డపైకి తరలించారు. 5 రోజులుగా వర్షం కురుస్తూనే ఉందని అయినా ఐకేపీ అధికారులు ధాన్యాన్ని కొనడం లేదని రైతులు తెలిపారు ధాన్యానికి మొలకలు వచ్చి చెరువులో మునిగి పోతున్నాయని గన్ని బ్యాగులు లేవని లారీలు లేవని సాకులు చెబుతున్నారన్నారు.. తుర్కపల్లి కి వచ్చిన గన్నీ బ్యాగులను ప్రైవేటు కొనుగోలుదారులకు కమీషన్లకు కక్కుర్తిపడి వారికే ఇస్తూ వారి వద్దనే కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నర్మద. అనే మహిళా రైతు కు చెందిన 500 సంచులు ప్రభు. 600 శ్రీపాదరావు దేశ్ముఖ్ 800 కుర్మా సాయి గొండ 500 చిలుముల నరసింహారెడ్డి 500 సంచులు ధాన్యం చెరువులోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో గడ్డకు తీసి పోసుకున్నారు. వీరితో పాటు ఇంకా 50 మంది రైతులవి అలాగే ఉన్నాయి. ఇక్కడ వరి ధాన్యం తడుస్తోందని భయంతో చెరువు తూములను ఎత్తివేయడంతో చెరువులోని నీరంతా వృథాగా వెళ్ళిపోయింది. ఐకేపీ అధికారుల నిర్లక్ష్యానికి ఇక్కడ ధాన్యం తడిసి పోవడంజరిగింది. అక్కడ నీళ్లు వృధాగా వగులోకి వెళ్లిపోవడంతో రెండు విధాల రైతులకు నష్టం జరిగిందని రైతన్న తన ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ అధికారులు దళారుల వద్ద కమిషన్ తీసుకొని వారికి వంత పాడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.. రెండు నెలలుగా వరి ధాన్యాన్ని ఇక్కడకు తెచ్చి పెట్టుకున్నామని పొలం వద్ద నుండి ఇక్కడికి తరలించడానికి ఒక్క ట్రాక్టర్ కి ఐదు వందలు చొప్పున చెల్లించి ఇక్కడికి తెచ్చామని ఇప్పుడు ఇక్కడ తడుస్తూంటే ఎక్కడికి తీసుకపోయి పోయాలని మళ్లీ ఈ కిరాయిలు ఎవరు భరిస్తారని రైతులు వాపోతున్నారు. ఇక్కడికి వచ్చిన గన్నీ బ్యాగులను రైతులకు ఇవ్వడం లేదని ఎవరు డబ్బులు ఇస్తే వారికే ఐకేపీ సెంటర్ అధికారులు కోమ్ము కాస్తున్నారని రైతులు వాపోయారు. కెసిఆర్ ప్రభుత్వం ఓ మంచి సదుద్దేశంతో ఐకేపీ కేంద్రాలను కొనసాగిస్తూ ఉంటే అధికారులు మాత్రం దానిని దుర్వినియోగ పరుస్తూ దళారులతో కుమ్మక్కై రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతుల వద్ద రెండు కిలోల తరుగు. సంచికి ఒక్క రూపాయి వసూలు చేస్తున్నారనీ రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ధాన్యం తడిసి మొలకెత్తడo చెరువులోని నీరు వృధాగా పోవడానికి కారణమైన ఐకెపి అధికారులపై చర్యలు తీసుకొని రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.