తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టను;వైఎస్ జగన్

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్న సమయంలోనే... ఆమె సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

0
TMedia (Telugu News) :

టీమీడియా అమరావతి;

తెలంగాణకు ఒకవైపు చెల్లెలు షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్న సమయంలోనే ‘తెలంగాణ రాజకీయాల్లో నేను వేలు పెట్టలేదు. ఇకపైనా పెట్టను’ అని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల పాలకుల మధ్య సఖ్యత ఉండాలంటూ ఈ మాటలు చెప్పినప్పటికీ… సరిగ్గా తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఆవిర్భావ సమయంలోనే జగన్‌ ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.

గురువారం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా రాయదుర్గంలో, కడప జిల్లా పులివెందులలో జరిగిన రైతు దినోత్సవ బహిరంగ సభల్లో జగన్‌ మాట్లాడారు. ‘‘ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతో విభేదాలు పెట్టుకోం. ఎవరితోనైనా సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటాం. పక్క రాష్ట్రంలో, ఇక్కడ ప్రజలు చల్లగా బాగుండాలని.. అలా ఉండాలంటే పాలకుల మధ్య సఖ్యత ఉండాలి. అందుకే తెలంగాణ రాజకీయాల్లో నేను వేలు పెట్టలేదు. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లోనూ వేలు పెట్టలేదు. రాబోయే రోజుల్లో కూడా పెట్టను’’ అని జగన్‌ తెలిపారు.

s s consultancy

సఖ్యతతో సమస్యలను పరిష్కరించుకోవాలన్నదే తన అభిమతమని చెప్పారు.మా నీళ్లే వాడుకుంటాం…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు ప్రస్తావించకుండానే… జగన్‌ ‘జలజగడం’పై స్పందించారు. కృష్ణా జలాల వాడ కంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ అంటే కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల కలయిక అని, దశాబ్దాల తరబడి మూడు ప్రాంతాల మధ్య నీటి కేటాయింపులు ఆ మేరకు ఉన్నాయని.. రాష్ట్రం విడిపోయిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి తెలంగాణ, ఏపీ, కేంద్ర ప్రభుత్వం కలిసి సంతకాలు చేశాయని గుర్తుచేశారు. 811 టీఎంసీల్లో.. సీమకు 146 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు కేటాయించారన్నారు.

‘దేవుడి దయతో ఈ రెండేళ్లు మంచి వర్షాలు కురిశాయి. ఈ రెండేళ్లను పక్కనబెట్టి.. 20 ఏళ్ల లెక్కలను చూస్తే… శ్రీశైలంలో 881 అడుగులపైన నీళ్లు కేవలం 20, 25 రోజులు ఉన్నాయని చెప్పలేని పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణ లోని పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి కెపాసిటీ పెంచి ప్రస్తుతం నీళ్లు వాడుకుంటున్నారు. 800 అడుగులలోపే నీళ్లు తీసుకునే పరిస్థితి ఆ రాష్ట్రానికి ఉంది. 796 అడుగుల్లోనే కరెంటును ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగుల్లోపు మీకు కేటాయించిన నీటిని వాడుకోవడం మీకు తప్పు లేనప్పుడు.. అదే 800 అడుగుల్లో మేం కూడా రాయలసీమ లిఫ్టు పెట్టి మాకు కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పేముంది’ అని ప్రశ్నించారు. రైతు ఎక్కడున్నా.. రైతేనన్నారు. నీళ్లు ఎవరికైనా ప్రియమేనని.. అక్కడి వాళ్లు బతకాలి… మనం కూడా బతకాలని వ్యాఖ్యానించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.