ప్రెస్ క్లబ్ భవన స్థలానికి సహకరిస్తాం.— ఎమ్మెల్యే దివాకర్ రావు.

ఆత్మీయ సమావేశంలో క్లబ్ స్థలానికి హామీనిచ్చిన ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

లక్షెట్టిపేట:

ప్రెస్ క్లబ్ భవన స్థలానికి సహకరిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని స్థానిక ఎస్ ఆర్ ఆర్ గార్డెన్ లో లక్షెట్టిపెట్ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టే క్రమంలో విలేకరులు యదార్ధంగా వార్తలు రాయడం ఎంతో అవసరమన్నారు. రాజ్యాంగం ప్రకారం, ప్రజాసౌమ్యంలో నాలుగవ స్తంభంగా పిలువబడే మీడియా వలననే సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు.

Also Read:చెరువు కట్ట  కంప తీసుకున్న స్విమ్మర్స్ కమిటీ సభ్యులు

ముఖ్యంగా పాత్రికేయులు ప్రజా సమస్యలను పాలకులకు దృష్టి కి తీసుకువచ్చే క్రమంలో స్వీయ నియంత్రణ ను పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను విస్మరించి కొందరు దురుద్దేశంతో ఏవో కొన్ని సమస్యలను భూతద్దంలో పెట్టి చూడటం సబబు కాదన్నారు. అదే విధంగా పాత్రికేయులు తమ సామాజిక బాధ్యత ను నిర్వర్తించే క్రమంలో బెదిరింపులు,ఇబ్బందులు ఎదుర్కోవడం సహజమని ఆయన వివరించారు. అంతేకాకుండా వాస్తవాలను రాసే క్రమంలో విలేకరులు ఎంత మాత్రం భయపడవద్దని, నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలుపాలన్నారు. విలేకరుల వృత్తి ముళ్ల కీరిటమని, వృత్తి ధర్మం పాటించడంలో పారదర్శకత పాటించాలని కోరారు. అనంతరం ప్రెస్ క్లబ్ అభ్యర్ధన మేరకు లక్షెట్టిపెటలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ స్థలానికి ప్రభుత్వం తరపున తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సాధ్యమైనంత త్వరలో విలేకరులకు న్యాయం చేస్తానని, ప్రెస్ క్లబ్ స్థల నిర్ధారణ తర్వాత ఆ స్థలం కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

s s consultancy

Also Read:విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలి.సిపి

అంతేకాకుండా ప్రభుత్వం తరపున వచ్చే సంక్షేమ పథకాలతో పాటు విలేకరులు ఇతర ఆదాయ మార్గాలు తమకు తాముగా ఏర్పరుచుకోవాలని హితవు పలికారు. అంతకుముందు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వంగల మధుసూదన్ మాట్లాడుతూ…. పాత్రికేయులు సమాజ సేవకులు అని, సమాజానికి మంచి చేసే క్రమంలో వార్తలను రాస్తే కొందరు జీర్ణించుకోలేక విలేకరుల గురించి దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ప్రతి విలేకరి ఎన్నో వ్యయా, ప్రయాసలను ఎదుర్కొని సామాజిక బాధ్యత ని నిర్వహిస్తున్నారని వివరించారు. అంతకుముందు డిసిఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య మాట్లాడుతూ…. విలేకరులు సమాజ శ్రేయస్సు కోరుతూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఎప్పటికప్పుడు వార్తలను ప్రజలకు చేరవేస్తున్నారన్నారు. అనంతరం నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు మాట్లాడుతూ…. మంచి వార్తలు రాసి సమాజానికి అండగా నిలుస్తున్న విలేకరులపై ఎంతో బాధ్యత ఉందన్నారు. అంతకుముందు మున్సిపల్ వైస్ చైర్మన్ పొడిటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…..విలేకరులు వృత్తి నైపుణ్యాలను పెంచుకుని సామాజిక బాధ్యత గా వార్తలు రాసి సమాజంలో మంచి మార్పుకు కృషి చేయాలని కోరారు.

Also Read:దేశంలోనే సీఎం జగన్ అరుదైన రికార్డు

అనంతరం మాజీ డిసిఎమ్మెస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… సమాజంలో అన్ని పత్రికలు, చానెళ్లు సమానమేనని, వార్తలు ప్రజలకు తెలిపే క్రమంలో ఎలాంటి ఆత్మనూన్యత భావానికి, భయాలకు లోను కాకుండా రాయాలన్నారు. అనంతరం నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ను ఎమ్మెల్యే, స్థానిక నాయకులు శాలువా,పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఎంపిడిఓ సత్యనారాయణ, ఎఫ్ ఆర్ ఓ స్వామి, ఎక్సజ్ ఎస్సై దామోదర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వంగల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి బోనగిరి కుమార్,ఉపాధ్యక్షులు చీకటి తిరుపతి, అల్లంపల్లి రమేష్, గౌరవ సలహాదారు ప్రసన్నకుమార్, కోశాధికారి సందీప్, ప్రచార కార్యదర్శి వేణుగోపాల్,పాత్రికేయులు సుధాకర్,ఎన్. తిరుపతి, వెంకటస్వామి, హాజీ పాషా, వంశీ గౌడ్,సల్మాన్,సృజన్,మహి,వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.