మానవత్వం చాటుకున్న మిత్ర బృందం

0
TMedia (Telugu News) :

మానవత్వం చాటుకున్న మిత్ర బృందం

s s consultancy

ఖని కి చెందిన యువకుడు కోవిడ్ బారిన పడి మృతి చెందిన కల్వల సతీష్.

టి మీడియా ప్రతినిధి/ గోదావరిఖని జూన్ 27

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని విట్టల్ నగర్ చెందిన కల్వల సతీష్ కుమార్ అనే యువకుడు గత వారం రోజుల క్రిందట కోవిడ్ బారినపడి,దురదృష్టవశాత్తు వల్ల మృతి చెందడం జరిగింది.సతీష్ చిన్న చితక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు,ఇందులో భాగంగా కోవిడ్ రెండో దశలో దురదృష్టం కొద్దీ సతీష్ కు కోవిడ్ సోకడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ లో ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు.సతీష్ ఎంబీఏ చదువుకోవడం జరిగింది, ఎంబీఏ బ్యాచ్ 2002-2004 వారి మిత్ర బృందం అందరూ కలిసి సతీష్ కుటుంబానికి మేము అండగా ఉన్నామని మానవత దృక్పధంతో స్పందించి 50,000/-వేల రూపాయలు భార్య, పిల్లలకు,సతీష్ మిత్రులు మద్దెల మహేష్ కుమార్, దుర్గం హరి కృష్ణ,వారి స్వగ్రామం సుల్తాన్ బాద్ మండలం కాట్నాపల్లి లో ఇంటికి వెళ్లి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.వారు మాట్లాడుతూ మా మిత్రుడైన సతీష్ మృతి చెందండం జీర్ణించుకోలేక పోతున్నామని వారు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యామని పేర్కొన్నారు.అన్ని రాకాలుగా మృతుడి కుటుంబానికి ఎంబీఏ బ్యాచ్ నిరంతరం అండగా ఉంటుందని వారు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.మృతుడి చిత్రపటానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.