మానవత్వాన్ని చాటుకున్న ఏసీపీ: వెంకటేశ్వర్లు

0
TMedia (Telugu News) :

మానవత్వాన్ని చాటుకున్న ఏసీపీ: వెంకటేశ్వర్లు

s s consultancy

టీ-మీడియా నిజామాబాద్

రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ లో విధులను పర్యవేక్షిస్తున్న ఏసిపి ఆరే వెంకటేశ్వర్లు వాహనంలో వెళ్తుండగా రోడ్డు పక్కన ఫిట్స్ తో కొట్టుకుంటున్న ఓ వ్యక్తిని గమనించి తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నాడు. దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి చికిత్స పొందుతూ హఠాత్తుగా ఆ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే సారంగపూర్ కు చెందిన బోదాసు సాయిలు (65) శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నగరంలోని సాయి రెడ్డి పెట్రోల్ బంక్ సమీపంలో ఫిట్స్ తో పడిపోయి గిలగిల కొట్టుకుంటున్నాడు. అదే సమయంలో బందోబస్తును పర్యవేక్షించేందుకు పెట్రోలింగ్ చేస్తున్న నిజామాబాద్ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్లు అతడిని గుర్తించి తన వాహనాన్ని ఆపారు. అనంతరం అతడిని తన వాహనంలోనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి జాయిన్ చేసి తన మానవత్వాన్ని చాటారు. అయితే కొద్దీ సేపటికే ఆ వ్యక్తి గుండె పోటుకు గురై మృతి చెందాడు. ఒక ఏసీపీ స్థాయి అధికారిగా ఉండి మానవత్వాన్ని చూపి కాపాడే ప్రయత్నంలో మరణించడం బాధాకరం అని నిజామాబాద్ ఏసిపి ఆరే వెంకటేశ్వర్లు సైతం బాధ పడ్డారు. తన ప్రయత్నం వృధా కావడంతో బ్రతికి ఉంటే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.