మనసున్న సర్పంచ్ మా”రావు”

0
TMedia (Telugu News) :

మనసున్న
సర్పంచ్ మా”రావు”

-వీరమనేని ‘విలువ” వెలకట్టలేనిది.

-ప్రజల ప్రాణాలే ముఖ్యం-పదవులు శాశ్వతం కాదు.

s s consultancy

-ప్రజల మనిషిగా మంచి పేరు

-సొంత ఖర్చులతో కరోనా శవాలకు అంతిమ సంస్కారాలు.

-అభినందనలు తెలుపుతున్న పాలకుర్తి ప్రజలు.

పాలకుర్తి,మే09
(టీ-మీడియా ప్రతినిధి):

మానవ సంబంధాలను మంట కలుపుతూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న తీరు అంతా ఇంతా కాదు.కరోనా ఊబిలో చిక్కుకొని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ ఆపత్కాల సమయంలో నేనున్నానంటూ ఆ కాస్త భరోసాను ఇస్తున్నారు పాలకుర్తి గ్రామ సర్పంచ్ వీరమనేని యాకాంత రావు
పాలకుర్తి నియోజక వర్గ కేంద్రంలో రెండవ దశ కరోనా రక్కసి విలయ తాండవం చేస్తు మరణమనే పేరుతో మనుషులను మట్టు పెడుతున్నది.ఈ అలజడిని పసిగట్టిన గ్రామాలు మేల్కొని స్వచ్ఛందంగా తమ తమ గ్రామాలను లాక్ డౌన్ పేరుతో కట్టుదిట్టం చేసుకున్నప్పటికి ఫలితం మాత్రం కనబడటం లేదు.మండల కేంద్రంలో ఇప్పటికే ఐదుగురు కరోన రోగులు మరణించారు. జనజీవనం అస్తవ్యస్తంగా బ్రతుకు జీవుడా అని వెళ్లదీస్తున్న సమయంలో కరోనా కాటుకు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి.ఇటువంటి విపత్కరమైన సమయంలో ప్రజలు దిక్కుతోచని గందరగోళ పరిస్థితుల నడుమ తమ కుటుంబ సభ్యులు ఎవరైనా కరోనాతో చనిపోతే ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో విగత జీవులుగా మారుతున్నారు.సమాజంలో మానవత్వానికి ఇంకా ఊపిరి మిగిలే ఉన్నదని నిజం చేస్తు అనాధలుగా మారిన శవాలకు తన సొంత ఖర్చులతో అంతిమ సంస్కారాలు చేస్తు మానవత్వాన్ని చాటుకుంటున్నాడు పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంత రావు. ఇలా తమకు తోచిన విధంగా ప్రజలకు తనదైన రూపంలో ఆర్థిక సహయ సహకారాలు చేస్తూ ప్రజా ప్రతినిధులకు,అధికారులకు,
ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచ్ యాకాంత రావు ను పలువురు అభినందిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.