మానవత్వం చాటుకున్న గ్రామ సర్పంచ్

0
TMedia (Telugu News) :
s s consultancy

మానవత్వం చాటుకున్న గ్రామ సర్పంచ్

టీ మీడియా అచ్చంపేట, మే 14:
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు కరోనాతో మృతిచెందాడు. యువకుడి మృతి తో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో మొదటి కరోనా మరణం జరగడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ,ఆందోళనకు గురయ్యారు. దహన సంస్కారాలు( శవాన్ని పూడ్చి పెట్టడానికి) ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామ సర్పంచ్, కర్నె.లక్ష్మీనారాయణ స్వయంగా సహాయం చేయడానికి ధైర్యంతో పీపీఈ, కిట్టు ధరించి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమయ్యారు. అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తో పాటు మరో నలుగురు యువకులు ,సర్పంచ్ కు, జత కలిసి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. యువకుడి మృత దేహాన్ని ఇంటి నుండి గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడే జెసిబి సాయంతో గుంత తీసి మృతదేహాన్ని అందులో ఉంచి అంత్యక్రియలను పూర్తి చేశారు. గ్రామ సర్పంచ్, కరోనా వైరస్, వ్యాప్తిని అరికట్టడానికి కొన్ని కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మానవత్వం సర్పంచ్, ను ప్రజలందరూ అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.