కొండరెడ్లకు .స్వచ్చంధ సంస్థ సాయం.

టీమీడియాచింతూరు;

0
TMedia (Telugu News) :

హైదరాబాద్ కి చెందిన
సమరిటర్న్స్ ఫర్ ది నేషన్ ఎన్ జీఓ దాతల సహకారంతో
ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు టార్పైలినలు, నిత్యవసర సరుకులు, మాస్కులు ,ప్రోటీన్ పౌడర్ అందజేయడం జరిగింది.

s s consultancy

వి.అర్.పురం మండలంలోని మారు మూల గోదావరి పరివాహక ప్రాంత మైన పాపికొండల ప్రాంతంలోని కొండేపూడి కొండరెడ్ల కుటుంబాలకు ఏ యస్ డి యస్ స్వచ్చంధ సంస్థ కొండంత సాయం చేసింది. హైదరాబాద్ కి చెందిన సమరిటర్న్స్ ఫర్ ది నేషన్ ఎన్ జీఓ దాతల సహకారంతో ఏ యస్ డి యస్ వారుముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు టార్పైలిన్లు, నిత్యవసర సరుకులు, మాస్కులు ,ప్రోటీన్ పౌడర్ అందజేయడం జరిగిందని సంస్థ అధినేత వి. గాంధిబాబు తెలిపారు. గోదావరి వరదలు దృష్టిలో ఉంచుకొనిగోదావరి నది వరదలు సంభవించే క్రమంలో కొండరెడ్లు ఉండటానికి నిలువు నీడ లేని పరిస్థితి ఈ క్రమంలో పలు మార్లు వర్షపు నీటిలో ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి.

ప్రతి సంవత్సరం గోదావరి వరదలకు కొండరెడ్లు ఇబ్బంది పడుతున్న కష్టాలను, ఇబ్బందులను కళ్లారా చోసిన సంస్థ అధినేత వి. గాంధిబాబు ఈ సారి వరదలు గట్లా సంభవిస్తే వారు ఇబ్బందులకు గురికాకూడదని ముందస్తుగా కొండేపూడి గ్రామస్థులకు, సుమారు 27 కుటుంబాలకు కొండపైన వేసుకున్న పాకలు కప్పుకోవడం కోసం టార్పాలిన్లు అందించారు. వాటికి తోడు నిత్యవసర సరుకులు, మాస్కులు ,గర్భిణీలకు ప్రోటీన్ పౌడర్ అందజేయడం జరిగిందని సంస్థ అధినేత వి. గాంధిబాబు తెలిపారు. బాధిత కుటుంబాలకు తహశీల్దార్ ఎన్. శ్రీధర్, మాజీ బాలలహక్కుల కమిషన్ సభ్యులు వి. గాంధిబాబు చేతుల మీదగా వితరణ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.