రంజాన్ ప్రార్థనలు ఇంట్లోనే జరుపుకోవాలి

0
TMedia (Telugu News) :
s s consultancy

రంజాన్ ప్రార్థనలు ఇంట్లోనే జరుపుకోవాలి
*నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్

టి మీడియా నాగర్ కర్నూల్ మే 13: నాగర్ కర్నూలు జిల్లాలో కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ముస్లిం సోదరులు శుక్రవారం జరుపుకోనున్న
ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను కుటుంబ సభ్యులతో కలసి ఇంట్లోనే రంజాన్ ప్రార్థనలు జరుపుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం నేటితో ముగుస్తుంది. 30 రోజులుగా ముస్లిం సోదరులు చేసే అత్యంత కఠిన ఉపవాస దీక్షల్ని గురువారంతో ముగియనున్నది, దేశవ్యాప్తంగా శుక్రవారం పండుగ వేడుకలు జరగనున్నాయి.
రంజాన్‌ పండుగ ప్రార్థనలు ఈద్గాల దగ్గర జరిగేవి.
రెండో దశ కరోనా తీవ్రత లాక్ డౌన్ కారణంగా ఈసారి కూడా గత సంవత్సరం మాదిరిగానే ఇళ్లల్లోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని కలెక్టర్ శర్మన్ ముస్లిం మత పెద్దలకు సూచించారు. సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండాలని కలెక్టర్ శర్మన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అందించిన 6500 ఈద్ తోఫాను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ నుండి నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి 1,500 కల్వకుర్తి నియోజకవర్గానికి 2,000 కొల్లాపూర్ 1,500 అచ్చంపేట నియోజకవర్గానికి 1,500 ల ఈద్ తోఫాలను ఆయన నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో ముస్లిం కుటుంబాలకు ఇదివరకే అందించడం జరిగిందని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ముస్లిం సోదరులకు ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కలెక్టర్ శర్మన్ ఆకాంక్షించారు.
కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వ విధించిన లాక్ డౌన్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.