ప్రభుత్వ స్థలంలో ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేయండి*;ఎమ్మెల్యే కి సిపిఐ వినతి

0
TMedia (Telugu News) :

ప్రభుత్వ స్థలంలో ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేయండి*;ఎమ్మెల్యే కి సిపిఐ వినతి

s s consultancy

కుత్బుల్లాపూర్ ప్రతినిధి మే28(టి మీడియా)

జగద్గిరిగుట్టలో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమి లో ఆస్పత్రి నిర్మాణం కు కృషి చేయూలి అని శుక్రవారం స్థానిక ఎమ్యెల్యేకి సిపిఐ అద్వర్యం లో వినతి ఇచ్చారు. భూమికబ్జాదారుల పాలు కాకుండా ఒక ప్రభుత్వ ఆసుపత్రిని కడితే ప్రజలకు ఉపయోగపడుతుందని చొరవ తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ నేతృత్వంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏసురత్నం,రాములు కలిసి ఎమ్ ఎల్ ఏ కె.పి.వివేకానందా గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.స్థలాన్ని ఆయన కాపాడి ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ప్రజలకు సేవ చేసిన్నట్టు అవుతుంది కబ్బాట్టి ఆసుపత్రి ఏర్పాటు కోసం చొరవ తీసుకోవాలని కోరడం జరిగింది. నియోజకవర్గంలోని ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా ప్రజలనుండి అధికమోత్తములో ఫీజులు వసూళ్లు చేసి ప్రజలను అప్పులపాలు చేస్తున్నయ్యాని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడి నిబంధనలు మేర ఫీజులు వసూళ్లు చెయ్యాలని హెచ్చరించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా వివేకానందా సానుకూలంగా స్పందించి గతంలోనే ప్రభుత్వ ఆసుపత్రికోసం ఫైల్ తయారు చేశానని సీపీఐ మంచి ప్రతిపాదనను చేసిందని వెంటనే ఆ స్థల సేకరణ కోసం కలెక్టర్ గారికి ఫైల్ పంపించి త్వరలోనే అందరం కలిసి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి పూకునుకుందామని అన్నారు.ప్రైవేట్ ఆసుపత్రిల దోపిడీ పై కఠినంగా వ్యవహరిస్తామని ఏమైనా సమస్యలు ఉంటే తెల్పగలరని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.