కొండగట్టు ఆలయం వద్ద శాశ్వత హెలిప్యాడ్‌..ఎమ్మెల్సీ కవిత

0
TMedia (Telugu News) :
s s consultancy

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రసిద్ధమైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద శాశ్వత హెలిప్యాడ్‌ను నిర్మించినట్లు తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. లాక్‌డౌన్‌ అనంతరం కొండగట్టుకు ప్రభుత్వం హెలికాప్టర్‌ సేవలను ప్రారంభిస్తుందని వెల్లడించారు. గురువారం ఆమె హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కొండగట్టు అలయం వద్ద అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను వెల్లడించారు. హనుమాన్‌ పూజల ప్రసారాల కోసం భారీ స్పీకర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొండగట్టు సేవాసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం గురువారంతో 82 రోజులు పూర్తి చేసుకుందని తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు, ప్రతి ఇంట్లో పదకొండు సార్లు చాలీసా పారాయణంతో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసిందన్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం 64 కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పూర్తయిందని, రామ స్తూపం, కల్యాణమంటపం, స్నానగదులు, సంచార సౌచాలయాలు ఇతర నిర్మాణ పనులు లాక్‌డౌన్‌ అనంతరం ప్రారంభమవుతాయని ఆమె వివరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.