వృత్తులపై నైపుణ్యతలు పెంచే దారులేవి.

0
TMedia (Telugu News) :

మంచిర్యాల జిల్లా ప్రాంతమైన జన్నారం, దండేపెల్లి, లక్షెట్టిపేట మండలాల్లో ఉన్న కుల వృత్తి దారులు, నిరుద్యోగ యువతీ యువకులకు వృత్తి శిక్షణ నైపుణ్యం పెంచుకునే అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

మంచిర్యాల జిల్లాలో 60 శాతం మంది అభయారణ్యాల పైనే ఆధారపడి జీవిస్తున్నారు. అభయరణ్యం రక్షణకు ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు అమలు చేయడంతో వారిలో చాలా మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కానీ కుల వృత్తి దారులైన మేదరులు, గిరిజనులు అడవికి వెళ్లి వెదురు బొంగులతో రకరకాల ఆకృతుల్లో బుట్టలు, చాటలు తయారు చేయడం. వారి యొక్క ప్రత్యేకత ఇలాంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు ఉండడంతో అడవికి వెళ్ళనీయకుండ ఇవ్వకుండా ఉంటే వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని. అభయారణ్యానికి నష్టం వాటిల్లకుండా కుల వృత్తి దారులు నైపుణ్యాన్ని పెంచి వారికి ఉపాధి కలిగించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మండలాల ప్రజలు పోతున్నారు.

s s consultancy

అదే సమయంలో మండలలలో చదువుకున్న చాలా మంది నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారు. వారిలో చాలామందికి సాంకేతికపరమైన నైపుణ్యాలు లేక పోవడంతో సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదు. ప్రభుత్వం స్పందించి జిల్లాలో ఉన్న కులవృత్తి దారులు నిరుద్యోగ యువతీ యువకులకు వృత్తిపరమైన నైపుణ్యతలు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Skill Guidance For People
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.