ఆర్టీసీ బస్సులో మంటలు..

0
TMedia (Telugu News) :

హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది..వరంగల్ వన్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ బస్టాండ్ వద్దకు చేరగానే బస్సు మోషన్ అందుకోవడం లేదని అనుమానం రావడంతో, బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దింపారు. అప్పటికే బస్సులో నుండి పొగలు వచ్చి ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. స్టేషన్ ఘనపూర్ లో ఫైర్ ఇంజన్ లేక పోవడంతో మంటలు ఆర్పేందుకు పోలీసులు, స్థానికుల సహాయంతో బకెట్ లతో నీళ్లు పోశారు. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.