హమీని అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ – ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌

0
TMedia (Telugu News) :
s s consultancy

హమీని అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ – ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌

టీమీడియా/జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా) మే 18 : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సంగారెడ్డి జిల్లాకు మెడికల్‌ కాలేజ్‌ మంజూరు చేశారని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే కనివిని ఎరుగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ అందిస్తున్నరని మంగళవారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఆలాగే వ్యవసాయ సాగు బడి పెట్టుబడి కోసం రైతు బంధు, రైతు బీమా, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ పథకాలు పకడ్చందీగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు నేరుగా కోట్లాది రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నారని ఆయన వివరించారు. సంగారెడ్డి జిల్లా కు మెడికల్‌ కాలేజ్‌ మంజూరు కావడం లో మంత్రి హరీష్‌ రావు కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ ప్రశంసించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.