ఆర్ఎఫ్సిఎల్ లో అమ్మోనీయ గ్యాస్ లీక్ తో

0
TMedia (Telugu News) :
s s consultancy

ఆర్ఎఫ్సిఎల్ లో అమ్మోనీయ గ్యాస్ లీక్ తో ఉలిక్కిపడ్డ పారిశ్రామిక ప్రాంత ప్రజలు.
 టి మీడియా //రామగుండం //పెద్దపల్లి జిల్లా.
గోదావరిఖనిలోని  రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ ఎఫ్ సి ఎల్) లో సోమవారం ఉదయం అమ్మోనియా గ్యాస్ లీక్ అవడంతో గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం ప్రజలు గంట పాటు లీకేజ్ అయిన వసనలతో ఒక్కసారి ఉలిక్కి పడ్డారు అని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు మద్దెల దినేష్  కొమ్మ చందు యాదవ్ స్థానిక ఎన్టీపీసీ లోని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ  అధికారి రవిదాస్ కి మంగళవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అనంతరం ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఉపాధ్యక్షులు కొమ్మ చందు యాదవ్ లు మాట్లాడుతూ ఆర్ ఎఫ్ సి ఎల్ చుట్టు తదితర ప్రాంతాల పెంచికల్పేట్, లక్ష్మీపురం, వీర్లపల్లి, గ్రామాల్లో  ఒక్కసారిగా లీకేజ్ అయినా  ప్రభావం ఎక్కువగా చూపగా గౌతమినగర్,ఇందిరా నగర్, తిలక్ నగర్, విట్టల్ నగర్, అడ్డగుంటపల్లి, ఐదవో ఇంక్లైన్,గోదావరిఖని, లక్ష్మీ నగర్, కళ్యాణ్ నగర్, వరకు అమ్మోనియా గ్యాస్ వ్యాపించడంతో ఈ ప్రాంత ప్రజలు అసలు ఏం జరిగిందో తెలియక భయభ్రాంతులకు గురైనారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్ ఎఫ్ సి ఎల్ లో  జరుగుతున్న వివిధ పనుల కారణంగానే అందులో నుండి వెలువడే ప్రమాదకరమైనటువంటి రసాయనాల లికేజీ వల్ల వాసన రావడంతో ప్రజలు తీవ్ర అయోమయానికి గురై ఏమి జరుగుతోందో అని అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఫ్రీల్లింగ్ యూనిట్ నుంచి అమ్మోనీయ లీక్ అయింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం ఎందుకు స్పందించడం లేదని వారు యాజమాన్యాన్ని హెచ్చరించారు.గతంలో కూడా ఇలాంటి  సంఘటనలు జరిగినప్పుడు ప్రాణాలకు తెగించి అప్పుడున్న కార్మికులు ఈ ప్రాంతానికె ప్రమాదమని తెలిసి వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దాదాపు ఒక నలుగురు మృతి చెందరని అన్నారు.అమ్మోనియం గ్యాస్ లీకేజ్ వల్ల ఏదైనా జరగరాని నష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అని వారు ప్రశ్నించారు.ఇటీవల కూడా రెండు మూడు పర్యాయాలు పని చేస్తున్న తరుణంలో గ్యాస్ లీకేజీ వల్ల కార్మికులు కూడా ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నరని వివిధ పత్రికల్లో కూడా చూడడం జరిగింది అన్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం ప్రారంభం కాకముందే ఇలాంటి దుర్ఘటనలో,సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన కనీస బాధ్యత లేదా అని ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రత మరియు యు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా వహించాలి కానీ నిరంకుశంగా వ్యవహరించడం సరి కాదని వారు హెచ్చరించారు.ఎన్నో పోరాటాలు ఉద్యమాలు ఆందోళనలు నిరసనలు చేసి ఎఫ్ సి ఐ ని ప్రారంభించుకుంటే దురదృష్టవశాత్తు వల్ల ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు అందులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరక్క ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ పరిశ్రమ ప్రారంభించుకొని పారిశ్రామిక ప్రాంత ప్రజలు కొత్త రోగాలు తెచ్చుకోవడమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.నానా హంగామా చేసిన అధికార పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు కనీసం ఆర్ ఎఫ్ సి ఎల్ మాన్యం తో ఇంత జరుగుతున్న ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా కనీసం వారితో సమావేశమైన నిర్వహించారా అని ప్రశ్నించారు.గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకొని ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఒకవైపు కలుషితం అయినటువంటి గోదావరి నీరు, ఇంకొకవైపు ఓసిపి ప్రాజెక్టుల శబ్దాలతో,విషవాయువులతో, మరొకవైపు  ఆర్ ఎఫ్ సి ఎల్ శబ్దాలు, కెమికల్స్ దుర్వాసనతో ఈ ప్రాంతం ప్రజలు జీవితం ప్రశ్నార్ధకంగా మార్చడానికేనా ? అని  ప్రజా ప్రతినిధులను యాజమాన్యాలను ప్రశ్నించారు.ఒకవైపు ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మరొకసారి ఇలాంటి గ్యాస్ లీకేజ్ ప్రజలకు ఇబ్బంది కలిగించే  విధంగా యాజమాన్యం ప్రవర్తిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుందని ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ప్రజలు ఆందోళనలు చేస్తారని ఉద్దేశంతో ఆర్ ఎఫ్ సి ఎల్  చూట్టు ఉన్న పరిసరాలో 144 సెక్షన్ పెట్టమని చెప్పడం సిగ్గు చేటు అన్నారు.అనంతరం కాలుష్య నియంత్రణ అధికారి రవి దాస్  సానుకూలంగా స్పందించి తగు విచారణ చేస్తామని చెప్పారు అని తెలియజేసారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.