నిషేధిత గుట్కా విక్రయాల పై ప్రత్యేక నిఘా

0
TMedia (Telugu News) :

నిషేధిత గుట్కా విక్రయాల పై ప్రత్యేక నిఘా

టి-మీడియా( జూన్ 6)కర్నూలు జిల్లా మహానంది

s s consultancy

మహానంది మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో హానికరమైన గుట్కా తయారీ, నిల్వ, సరఫరా మరియు అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు పలు దుకాణాలపై రైడ్స్ చేసి సోదాలు నిర్వహిస్తున్న మహానంది పోలీసులు

కర్నూలు జిల్లా ఎస్పీ, డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపిఎస్ వారి సూచనలతో మండలంలో మహానంది పోలీసులు గుట్కా తయారీ, నిల్వ, సరఫరా, అమ్మకాలు పై కేసులు నమోదు చేస్తున్నారు..
ఆదివారం గాజులపల్లి గ్రామంలో గుట్కా మరియు ఖైనీ వంటి నిషేధిత పదార్థాల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పలు కిరాణా షాపులు,బడ్డీ కొట్లు, కిళ్లీ షాపులు మరియు ఇతర ప్రదేశాల్లో ముమ్మర తనిఖీలు చేసిన ఎస్సై నాగార్జున రెడ్డి మరియు పోలీసు సిబ్బందితో కలిసి నిర్వహిస్తున్నారు..

ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉంటే దయచేసి మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి వారి నెంబర్కు(9121101093) తెలియజేయగలరు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.