చైనా గూఢచారి.. పదేళ్లుగా భారత్‌లోనే.. హైదరాబాద్‌లోనూ సంచారం

0
TMedia (Telugu News) :
s s consultancy

చైనా గూఢచారి.. పదేళ్లుగా భారత్‌లోనే!
2010లో హైదరాబాద్‌లోనూ సంచారం
బీఎస్‌ఎఫ్‌ దర్యాప్తులో వెల్లడించిన హాన్‌ జువ్వే

దిల్లీ: భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా దేశస్థుడు హాన్‌ జున్వే సాధారణ పౌరుడు కాదని… అతను నిఘా సంస్థ తరపున మన దేశంలో పదేళ్లకు పైగా గూఢచారిగా పనిచేస్తున్నాడని తేలింది. నకిలీ పత్రాలతో సిమ్‌ కార్డులు సంపాదించి, వాటిని అక్రమంగా చైనాకు తరలించడం సహా పలు ఆర్థికనేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. గురుగ్రామ్‌లో జున్వే.. స్టార్‌ స్ప్రింగ్‌ పేరిట హోటల్‌ నడుపుతూ తమ దేశస్థులు కొందరిని సిబ్బందిగా చేర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. తన సహచరుడితో కలిసి ఇప్పటివరకూ 13 వందలకు పైగా సిమ్‌ కార్డులను దొంగచాటుగా మన దేశం నుంచి చైనాకు తరలించినట్లు తెలిసింది. ఈ సిమ్‌ కార్డుల సాయంతో బ్యాంకు ఖాతాలను హ్యాక్‌ చేయడం సహా ఇతరత్రా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. లఖ్‌నవూలో నమోదైన ఓ కేసులో హాన్‌ జున్వే కోసం పోలీసులు గాలిస్తున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.