పరుగులు పెడుతున్న బంగారం ధర.. రెండు రోజులుగా పైకే!

0
TMedia (Telugu News) :

పరుగులు పెడుతున్న బంగారం ధర.. రెండు రోజులుగా పైకే!
టి-మీడియా/హైదరాబాద్(17):
*పసిడి ధర పైపైకి…
*రెండు రోజులుగా పెరుగుదల.
*గ్లోబల్ మార్కెట్‌లోనూ ధరలు హైక్.

s s consultancy

ఒకవైపు కరోనా ప్రజలను వణికిస్తుంటే మరోవైపు పసిడి రోజుకో రేటుతో హడల్ పట్టిస్తుంది. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి షాక్ మీద షాక్ కొడుతూనే ఉంది. పసిడి ధర మళ్లీ పైకి కదిలింది. వరుసగా రెండు రోజులుగా బంగారం ధర పరుగులు పెడుతూనే పోతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి పైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పైకి కదిలింది. రూ.48,930కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.220 పెరుగుదలతో రూ.44,870కు చేరింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పైకి ఎగసింది. బంగారం ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1844 డాలర్లకు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర పెరుగుదల కారణంగా దేశీ మార్కెట్‌లో పసిడి జిగేల్ మంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.