విద్యుత్ షాక్ తగిలి 32 గేదలు మృతి

0
TMedia (Telugu News) :

విద్యుత్ షాక్ తగిలి మూగజీవాల బలి…

s s consultancy

టి మీడియా ప్రతినిధి ,జన్నారం మంచిర్యాల జూన్ 27

జన్నారం మండలం లోని రోటి గూడ గ్రామంలో ఆదివారం విద్యుత్ షాక్ తో 32 గేదలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోటి గూడ గ్రామ సమీపం నుండి జన్నారం మండల గ్రామాలకు అందించే విద్యుత్ వైర్లు 11 కెవి తెగి పడటం వలన గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పశువులు వెళ్లే మార్గంలో విద్యుత్ వైర్లు తెగి పడి ఉండటం జరిగిందని అటువైపు మూగజీవాలు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ ప్రవాహం జరిగి గుంపులుగా వెళ్తున్నా పశువులు అక్కడికక్కడే మృతి చెందాయని. పశువులు కాసే కాపర్లు వెనకవైపు ఉండడం ముందుగా వెళ్తున్న గేదులు విద్యుత్ షాక్ తో మృతి చెందాయని,వెనుక వైపు ఉన్న కాపర్లు ఒక్కసారిగా ముందుకు వచ్చి మిగితా పశువులను విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తెప్పించే ప్రయత్నం చేశారు.కానీ అప్పటికే తీవ్రమైన నష్టం వాటిల్లింది 32 గేదలు అక్కడికక్కడే మృతిచెందడంతో గ్రామంలో పశువుల యజమానులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి పోలీసులు విద్యుత్ శాఖ అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షించి తగిన పరిష్కరం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.