గవర్నర్ అత్యవసర రాక.. కేబినెట్ విస్తరణ ఉంటుందా?

0
TMedia (Telugu News) :

గవర్నర్ అత్యవసర రాక.. కేబినెట్ విస్తరణ ఉంటుందా?

s s consultancy

టి-మీడియా/హైదరాబాద్(13):
*బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన తమిళిసై
*గవర్నర్ రాకతో కేబినెట్ విస్తరణపై వార్తలు
*కేబినెట్‌లో మార్పులు ఉండనున్నాయా ?

తెలంగాణకు గవర్నర్ అత్యవసర రాక కలకలం లేపుతుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అందించారు. దీంతో పుదుచ్చేరిలో ఉన్న ఆమె అత్యవసరంగా హైదరాబాద్ వచ్చారు. ఈ మేరకు ఆమె ట్వీట్ కూడా చేశారు. అధికారిక పనుల నిమిత్తం అత్యవసరంగా పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాను అంటూ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బుధవారం మధ్యాహ్నం చేసిన ట్వీట్‌ చేశారు. దీంతో ఆమె ట్వీట్ రాష్ట్రంలో కొంత రాజకీయ వేడి పుట్టించింది. గవర్నర్‌ అత్యవసరంగా హైదరాబాద్‌కు బయలుదేరి వస్తున్నారంటే మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చుననే చర్చ మొదలయ్యింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందడంతోనే గవర్నర్‌ అత్యవసరంగా హైదరాబాద్‌కు బయలుదేరి ఉంటారనే ఊహాగానాలు నెలకొన్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో ఎవరిని మంత్రిగా నియమిస్తారనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోప్రస్తుత మంత్రివర్గంలో ఒకరిద్దరు మంత్రులపైనా వేటు పడుతుందని, కొత్తవారికి చోటు లభించే అవకాశాలున్నాయన్న ప్రచారం నెలకొంది. ఈటల రాజేందర్‌ను తొలగించిన అనంతరం వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్‌ తన వద్దే ఉంచుకున్నారు.
అయితే ఇప్పుడు ఆ శాఖను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్రమంత్రి అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ఆరోగ్య శాఖ మంత్రికి బదులు హరీశ్ రావు పాల్గొన్నారు. అయితే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్రం తరఫున హరీశ్‌రావు పాల్గొనడంతో ఆయనకు ఆరోగ్యశాఖ అందిస్తారా? అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కరోనా నియంత్రణపై ఇటీవల సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశంలో కూడా హరీశ్‌రావు పాల్గొన్నారు. వైద్యారోగ్య శాఖకు మంత్రిని నియమించే అవకాశాలుండడంతో రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా మంత్రివర్గ విస్తరణ జరగొచ్చని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై కూడా హైదరాబాద్ చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే రాజ్‌భవన్ అధికారిక వర్గాలు మాత్రం అలాంటిదేం లేదంటున్నారు. మంత్రివర్గ విస్తరణ అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రాజ్‌భవన్‌కు ఎలాంటి అధికారిక సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. కేవలం అంతర్జాతీయ నర్సుల దినోత్సవంతో పాటు వర్చువల్‌గా జరిగే మరో కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే గవర్నర్‌ హైదరాబాద్‌కు వచ్చారని అంటున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు అవుననే అనుమానం కలిగిస్తున్నాయి.

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.