ఆర్ఎంపిలను ప్రంట్ లైన్ వారియర్స్ గా ప్రభుత్వం గుర్తించాలి

0
TMedia (Telugu News) :
s s consultancy

ఆర్ఎంపిలను ప్రంట్ లైన్ వారియర్స్ గా ప్రభుత్వం గుర్తించాలి.

టి మీడియా ఖమ్మం 3.ఖమ్మం పట్టణంలో మేదర్ బస్తీలో ఉన్న ఆర్ఎంపి వైద్యుల సంఘం ఆఫీసులో అత్యవసర సమావేశం
ఆర్ఎంపి డబ్ల్యూ టీ ఎస్ జిల్లా అధ్యక్షుడు బొమ్మినేని కొండల రావు,ప్రధాన కార్యదర్శి బోయిన పల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో
జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిన పల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ
పట్టణాలను గడగడలాడించిన
కరోనా మహమ్మారి గ్రామాలపై
పడి పేధ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న తరుణం లో ఆర్ఎంపి వైద్యులు కరోనా తో
పోరాటం చేస్తూ ప్రాణాలను పణంగా పెట్టి పేద ప్రజల కోసం జనంలో ఉంటు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటు ప్రజల కోసం ముందుండి పనిచేస్తున్న
గ్రామీణ వైద్యులను ప్రంట్ లైన్ వారియర్స్ గా ప్రభుత్వం గుర్తించి
వారికి వెంటనే వ్యాక్సిన్ వేయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా లో కరోనా బారిన పడి ఆర్ఎంపి వైద్యులు పదుల సంఖ్యలో మరణించారని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.చాలా కుటుంబాలకు పెద్దదిక్కుగా ఉండి
కరోనా తో మరణించటం తో ఆ
కుటుంబ పరిస్థితి అగమ్యగోచరం
గా మారిందన్నారు.కరోనాతో మరణించిన గ్రామీణ వైద్యుల
కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షలు ఎక్స్ గ్రేసియా చెల్లించాలని,వారి కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా విద్యనందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎంపి
డబ్ల్యూ టీ ఎస్ రాష్ట్ర కన్వీనర్ రుద్ర గాని ఆంజనేయులు, ఎస్ వి రామారావు,అక్కినపల్లి నాగేశ్వరరావు,వి నారాయణ రావు, ఖమ్మం పట్టణ కార్యదర్శి రహీం, జిల్లా ప్రచార కార్యదర్శి గండారపు రామారావు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.