ప్రెండ్లి పోలీస్ కి సలాం

0
TMedia (Telugu News) :

ప్రెండ్లి పోలీస్ కి సలాం
(టీ మీడియా ప్రతినిది అశ్వారావుపేట)
నియోజకవర్గ కేంద్రమైన అశ్వరావుపేట పట్టణంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గంధ ఉపేందర్ తన వాహనంలో ఆసుపత్రికి తరలించి తన సహజత్వాన్ని మరోసారి నిరూపించుకున్న సంఘటన శనివారం పట్టణంలో జరిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో పట్టణంలో గస్తీ నిర్వహిస్తూన్నా సందర్భంలో భద్రాచలం రోడ్డు లో ఐరన్ షాప్ యజమాని కుమార్ ద్విచక్ర వాహనంపై అదుపు తప్పి కిందపడటం తో తీవ్రరక్త స్రవంలో ఉన్న వ్యక్తిని అటుగా పెట్రోలింగ్ గా వెళుతున్న సిఐ ఉపేందర్ చూసి వెంటనే తన వాహనం లో ఎక్కించుకుని సామజిక ఆరోగ్య కేంద్రం లో ప్రధమ చికిత్స చేయించి అనంతరం మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం తరలించారు.లాక్ డౌన్ కారణం గా ఎవ్వరు రోడ్ల మీద లేని కారణంగా సి ఐ తన సామాజిక బాధ్యత తో చేసిన పనికి వారికి వారి సిబ్బందికి కుమార్ కుటుంబం పట్టణంలో పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

s s consultancy
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.