కరోనా నేపథ్యంలో హాస్పిటల్ కు వచ్చే రోగులకు స్వచ్చంధ సంస్థల ఔదార్యం

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా నేపథ్యంలో హాస్పిటల్ కు వచ్చే రోగులకు స్వచ్చంధ సంస్థల ఔదార్యం
టి-మీడియా/వనస్ధలిపురం(17):
తెలంగాణా రాష్ట్రం లో కొరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తో పాటు వివిధ సేవా సంస్థలు ఎవరికి తోచిన విధంగా వారు హాస్పిటల్ కు వచ్చే రోగులకు తమకు తోచిన విధంగా సహాయం అందజేస్తున్నారు.
ఇందులో భాగంగా వనస్ధలిపురం గవర్నమెంట్ హాస్పిటల్ లో “హరే రామ హరే కృష్ణ స్వచ్చంద సంస్థ” రెడ్డి మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి ఆధ్వర్యంలో వనస్ధలిపురం గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు వారి సహాయులకు గత నాలుగు రోజులుగా రోజుకో రకంగా ఆహారం మరియు పండ్లు అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి మహిళా సంఘం అధ్యక్షురాలు నూకల పదారెడ్డి మాట్లాడుతూ తమ సంఘం తరుఫున గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చే రోగులకు వారి సహాయులకు లాక్ డౌన్ ముగిసేంత వరకు ఇదేవిధంగా తమ సహాయాన్ని అందిస్తామని, రోగులు ఎవరూ కూడా ఆకలితో ఇబ్బందులు పడొద్దని తామందిచే సహాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

(వెంకట్, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.