కోవిడ్ బాధితులకు ఇంటివద్దకే ఉచిత భోజనం

0
TMedia (Telugu News) :
s s consultancy

కోవిడ్ బాధితులకు ఇంటివద్దకే ఉచిత భోజనం

టీమీడియా సంగారెడ్డి జిల్లా : జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో కోవిడ్ బాధితులకు ఇంటివద్దకే ఉచిత భోజన ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఉచిత భోజన పంపిణీ సహాయ కేంద్రం నుంచి వాహనాలను అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కోవిడ్ బాధితులు ఎలాంటి సందేహాలు లేకుండా కలెక్టరేట్‌లోని సహాయ కేంద్రం నంబర్‌ 7207488 745కు ఫోన్‌చేసి వివరాలను నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌
రాజర్షిషా సూచించారు. వారికి నేరుగా ఇంటివద్దకే భోజనం ప్యాకెట్లను అందజేస్తామన్నారు. సోమవారం 200 భోజన
ప్యాకెట్లను అందజేసినట్టు వివరించారు. ఆదివారం పేర్లు నమోదు చేసుకున్నవారికి సోమవారం మున్సిపల్‌ సిబ్బంది భోజన ప్యాకెట్లను వాహనంలో తీసుకెళ్లి అందజేశారు. అలాగే మంజీర, కేబీఆర్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు కూడా భోజన ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాధికారమణి తదితరులు పాల్తొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.